తన పెన్నుకు పదును పెట్టే ఒక రచయిత…తనలోని ప్రతిభకు ప్రాణం పోసి తెరపై ఆవిష్కరించే ఒక దర్శకుడు…వీళ్ళిద్దరూ కలసి సందించిన సినీ అస్త్రాల్లో ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హల్‌చల్ చేసి రికార్డుల ప్రభంజనాన్ని సృష్టించాయి. అయితే అలాంటి కాంబినేషన్స్ విషయంలో మన టాలీవుడ్ కు ప్రత్యేక స్థానం లభిస్తుంది. మరి అలాంటి రచయత-దర్శకుల కలయికలు…వారి కాంబినేషన్ లో టాలీవుడ్ కు అందిన సక్సెస్ ల పై ఒక లుక్ వేద్దాం రండి.
జంధ్యాల + కే.విశ్వనాధ్ = శంకరాభరణం, సాగరసంగమం, సిరి సిరి మువ్వ, సప్తపధి, ఆపధ్భాంధవుడు.
త్రివిక్రమ్ + కే. విజయ్ భాస్కర్ = స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, జై చిరంజీవ.
బాపు + రమణ = సాక్షి, సంపూర్ణ రామాయణం, అందాల రాముడు, ముత్యాల ముగ్గు.
విజయేంద్ర ప్రసాద్ + రాజమౌళి = సింహాద్రి, సై, యమదొంగ, ఛత్రపతి, మగధీర, బాహుబలి.
పరుచూరి బ్రదర్స్+ బి.గోపాల్ = బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు.
వక్కంతం వంశీ + సురేందర్ రెడ్డి=కిక్, ఊసరవెల్లి, రేస్ గుర్రం.
యండమూరి + కోదండరామి రెడ్డి = అభిలాష, ఛాలెంజ్, ఒక రాధ ఇద్దరు కృష్నులు, దొంగ మొగుడు, కొండవీటిదొంగ.
సత్యానంద్ + రాఘవేంద్రరావు = జానకి రాముడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, పెళ్లి సందడి.
తనికెళ్ళ భరణి + వంశీ = లేడీస్ టేలర్, చెట్టు కింద ప్లీడర్, శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్, మహర్షి.
ఎల్.బీ శ్రీరామ్ + ఈ.వీవీ = అప్పుల అప్పారావు, హాల్లో బ్రదర్, ఆ ఒక్కటి అడక్కు.
పింగళి + కెవీ రెడ్డి = పాతాల భైరవి, మాయా బజార్, జగదేక వీరుని కథ
సత్య మూర్తి + రవి రాజా పినిశెట్టి = చంటి, పెదరాయుడు, పుణ్య శ్రీ, ముత్యమంత ముద్దు
గణేశ్ పాత్రో + బాలచందర్ = మరో చరిత్ర, ఇది కథ కాదు, ఆకలి రాజ్యం, గుప్పెడు మనసు
ఆత్రేయ + అదుర్తి సుబ్బా రావ్ = మూగ మనసులు, మంచి మనసులు, డాక్టర్ చక్రవర్తి
బీవీ.నర్సరాజు + కమలాకర్ కామేశ్వర రావ్ = గుండమ్మ కథ, శోభ
కోన వెంకట్ + శ్రీను వైట్ల = వెంకీ, ఢీ, రెడీ, దూకుడు