Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

తెలుగు సినిమాను ప్రపంచం ముందు అంతెత్తున కూర్చోబెట్టిన సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా చిత్రబృందం అంతా కలసి సంబరాలు చేసుకున్నారు. సినిమా ప్రధాన నటులు ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌ పాల్గొన్నారు. ఇక టెక్నికల్‌ టీమ్‌ నుండి రాజమౌళి, సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్‌, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్‌, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణులు శ్రీనివాస్‌ మోహన్‌, కమల్ కన్నన్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌ కార్తికేయ, శ్రీవల్లి, రమ తదితరులు పాల్గొన్నారు.

Baahubali Celebrations

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో సినిమాలోని తన ఫేమస్‌ డైలాగ్‌ ‘ఇది నా మాట.. నా మాటే శాసనం’తో కూడిన ఫ్లకార్డుతో రమ్యకృష్ణ కనిపించింది. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘రాజు ఎప్పటికీ రాజే’ అనే ప్లకార్డు పట్టుకొని ప్రభాస్ దిగిన ఫొటో కూడా సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. ‘సింహాసనం ఎప్పటికీ నాదే’ అని రానా పట్టుకున్న ప్లకార్డు మీద కనిపిస్తోంది.

ఇక నిర్మాత శోభు యార్లగడ్డ అయితే ‘హైసా రుద్రస్సా’ ని రాసిన ప్లకార్డును పట్టుకుని కనిపించారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి పియానో వాయిస్తూ పాట ఆలపించారు. అయితే, ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే సినిమా రాజమౌళి అండ్‌ కో. ముందస్తుగానే ప్లాన్‌ వేసుకొని కలిశారు అని అర్థమవుతోంది. కానీ కీలకమైన ఇద్దరు వ్యక్తులు మిస్‌ అయ్యారు. దీంతో వారి అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆ ఇద్దరూ హీరోయిన్లే.

మొత్తం ఫొటోల్లో అనుష్క, తమన్నా ఎక్కడా కనిపించలేదు. ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు కాబట్టి వాళ్లు కూడా ఉంటే బాగుండేది. ప్రభాస్‌, అనుష్కను ఒకే ఫొటోలో చూసి మురిసిపోదాం అనుకునే ఫ్యాన్స్‌ చాలా మందే ఉంటారు. ‘బాహుబలి’ పదో సంవత్సరం అనేసరికి కలుస్తారేమో అనుకుంటే ఇలా నిరాశపరిచారు. చూద్దాం మరోసారి స్పెషల్‌గా ఏమన్నా కలుస్తారేమో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus