ఎన్టీఆర్ (Jr NTR) – కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత రూపొందిన చిత్రం ‘దేవర'(మొదటి భాగం). సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. టాక్ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లు సాధిస్తుంది. ఇప్పటికీ ‘దేవర’ (Devara) హవా ఎంత మాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ వద్ద ఆల్రెడీ రూ.400 కోట్లు కొల్లగొట్టి రికార్డులు సృష్టించిన ‘దేవర’ .. ‘దసరా’ సెలవులు ముగిసేసరికి రూ.500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా తెలుస్తుంది. ‘దావూదీ’ సాంగ్ కూడా యాడ్ చేశారు కాబట్టి.. అది పెద్ద కష్టం కాదు.
ఇక ‘దేవర’ (Devara) హైలెట్స్ గురించి చెప్పాలంటే.. అనిరుధ్ అందించిన మ్యూజిక్, దర్శకుడు కొరటాల టేకింగ్, ఎన్టీఆర్ నటన, రత్నవేలు సినిమాటోగ్రఫీ, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గ్లామర్ తో పాటు.. కొన్ని డైలాగ్స్ ను కూడా చెప్పాలి. కొరటాల శివ.. ఈ సినిమాలో రాసిన కొన్ని డైలాగులు ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇక ఆ డైలాగులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :