Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Reviews » 2018 Review In Telugu: 2018 సినిమా రివ్యూ & రేటింగ్!

2018 Review In Telugu: 2018 సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 25, 2023 / 08:42 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
2018 Review In Telugu: 2018 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • టోవినో థామస్ (Hero)
  • అపర్ణ బాల మురళి (Heroine)
  • కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, లాల్ తదితరులు.. (Cast)
  • జ్యూడ్ ఆంటోనీ జోసెఫ్ (Director)
  • వేణు కున్నప్పిలి - సి.కె.పద్మకుమార్ - అఖిల్ పి.ధర్మాజన్ (Producer)
  • నోబిల్ పాల్ (Music)
  • అఖిల్ జార్జ్ (Cinematography)
  • Release Date : మే 26, 2023
  • కావ్య ఫిల్మ్ కంపెనీ - పికే ప్రైమ్ ప్రొడక్షన్ (Banner)

2018లో కేరళ భారీ వరదల నేపధ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం “2018”. టోవినో థామస్, కుంచకో బోబన్, ఆసిఫ్ అలీ వంటి టాప్ హీరోలందరూ కలిసి నటించిన ఈ చిత్రం మే 5న మలయాళంలో విడుదల అఖండ విజయాని సొంతం చేసుకొంది. మలయాళంలో 100 కోట్ల కలెక్షన్ సాధించిన రెండో చిత్రంగా చరిత్ర సృష్టించింది. అందుకే ఈ చిత్రరాజాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి గీతా ఆర్ట్స్ ముందుకొచ్చింది. అనువాద రూపంలో అదే పేరుతో ఇవాళ విడుదల చేసింది. ఈ సినిమాని కచ్చితంగా ఎందుకు చూడాలో చదివి తెలుసుకోండి.

కథ: ఇడుక్కి డ్యామ్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా పొంగిన వరద నీరు కారణంగా కేరళలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీటి ఉధృతతో చాలా ఇబ్బందిపడాల్సి వస్తుంది. ఆ క్రమంలో.. ఊరి ప్రజలు తమను తాము ఎలా రక్షించుకున్నారు? ప్రభుత్వం ఎలా సహకరించింది? అనేది “2018” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రతి ఒక్క నటుడూ సినిమాలోని పాత్రలో ఎంతలా ఒదిగిపోయాడంటే.. తెర మీద నటుల్ని కాక, ఊర్లోని కొంతమంది జనాల్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. గవర్నమెంట్ అధికారిగా కుంచకో బోబన్, మోడల్ గా ఆసిఫ్ అలీ, ఆర్మీ నుంచి పారిపోయి వచ్చి.. దుబాయ్ లో ఉద్యోగం కోసం తపించే యువకుడిగా టోవినో థామస్, జాలరిగా లాల్ ఇలా ప్రతి ఒక్కరూ పాత్రల్లో జీవించేశారు.

ఒకరి పాత్ర హైలైట్ మరొకరిది ఎలివేట్ అవ్వలేదు అని చెప్పడానికి లేదు. నెగిటివ్ రోల్స్ చేసిన ఆర్టిస్టులు ఎంతలా ఎలివేట్ అయ్యారో.. పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిన నటులు కూడా అదే స్థాయిలో ఎలివేట్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా ప్రొడక్షన్ డిజైన్ & గ్రాఫిక్స్ టీం గురించి మాట్లాడుకోవాలి. 2018 వరదలను అచ్చుగుద్దినట్లుగా రీక్రియేట్ చేశారు. అసలు క్లైమాక్స్ 20 నిమిషాలు ఎలా షూట్ చేశారా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో లేవనెత్తడం ఖాయం. వరదల్లో జనాలు బోట్ల మీద ప్రయాణించే సన్నివేశాలు ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే.. తక్కువ బడ్జెట్ లో అద్భుతమైన అవుట్ పుట్ ఎలా అందించాలి అనే సబ్జెక్ట్ మీద “2018” చిత్రాన్ని ఒక మాస్టర్ క్లాస్ గా ప్రెజంట్ చేయొచ్చు. అఖిల్ జార్జ్ ఛాయాగ్రహణం, నోబిల్ పాల్ సంగీతం సినిమాకి ఆయువుపట్టు లాంటివి. ఈ ఇద్దరూ కలిసి చేసిన మ్యాజిక్ కి ప్రేక్షకుల హృదయాలు బరువెక్కుతాయి.

దర్శకుడు జ్యూడ్ ఆంటోనీ జోసెఫ్ ఒక సాధారణ కథను, అసాధారణమైన స్క్రీన్ ప్లే & ఎమోషన్స్ తో నడిపించిన విధానం అభినందనీయం. మరీ ముఖ్యంగా 2018 వరదల కారణంగా జరిగిన చెడు కంటే.. మంచిని ఎలివేట్ చేస్తూ, కేవలం పాజిటివ్ యాంగిల్ లోనే సినిమాను ఎక్కువగా నడిపిన తీరు బాగుంది. ఈ కారణంగా కొన్ని కీలకమైన అంశాలను గాలికొదిలేయాల్సి వచ్చినా.. సినిమాలో ఎమోషన్ ఆ మైనస్ ను తెలియనివ్వలేదు.

విశ్లేషణ: సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల నేపధ్యంగా వచ్చే సినిమాలన్నీ కుదిరితే మరీ ఎక్కువగా భయపెట్టేస్తాయి, లేదా అనవసరమైన హీరో ఎలివేషన్స్ తో చిరాకు పెట్టిస్తాయి. కానీ.. ఆ రెంటికీ దూరంగా కేవలం మనిషిలోని మానవీయ కోణాన్ని ఎలివేట్ చేస్తూ కుదిరినంత పాజిటివిటీని మాత్రమే చూపిస్తూ తెరకెక్కిన “2018” కచ్చితంగా అందరూ చూడాల్సిన చిత్రం.

మలయాళంలో 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడం ఖాయం. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం సగటు ప్రేక్షకులు, ఒక నేచురల్ డిజాస్టర్ ను ఎలా తెరకెక్కించొచ్చు అనే విషయాన్ని నేర్చుకోవడం నవతరం ఫిలిమ్స్ మేకర్స్ తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాల్సిందే!

రేటింగ్: 3.5/5

Click Here To Read In ENGLISH

Rating

3.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #2018 Movie
  • #Aju Varghese
  • #Aparna Balamurali
  • #Jude Anthany Joseph
  • #Kalayirasan

Reviews

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Junior Review in Telugu: జూనియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Kothapallilo Okappudu Review in Telugu: కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

L2: Empuraan Collections: అక్కడ బ్లాక్ బస్టర్.. ఇక్కడ డిజాస్టర్!

trending news

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

Actor Fish Venkat: ప్రముఖ నటుడు ఫిష్‌ వెంకట్‌ కన్నుమూత!

7 hours ago
Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

Nuvvunte Chaley: రామ్ లిరిక్స్ తో.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ సింగిల్.. సాంగ్ ఎలా ఉంది?

11 hours ago
Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

Vassishta: ‘బింబిసార 2’ ఇష్యూపై క్లారిటీ ఇచ్చిన ‘విశ్వంభర’ దర్శకుడు!

11 hours ago
Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

Vishwambhara: రాజమౌళిలా స్టోరీ లైన్‌ చెప్పేసిన వశిష్ట.. అసలు పరీక్ష ముందుంది!

16 hours ago
Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

Anupama: అనుపమ పరమేశ్వరన్ హానెస్ట్ కామెంట్స్ వైరల్!

16 hours ago

latest news

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

స్టార్ హీరో సినిమాలో నా పాత్ర అంతా కట్ చేశారు.. నటి ఆవేదన!

11 hours ago
iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

iSmart Shankar: ప్లాప్ హీరోయిన్ కు బంపర్ ఆఫర్ ఇచ్చాడు పూరి, కానీ.. 6 ఏళ్ళ క్రితం అంత జరిగిందా!

11 hours ago
ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

ఇండియన్ సినిమాల్లో అరుదైన రికార్డు ఆ స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ సొంతం!

12 hours ago
డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం “ట్రాన్: ఆరీస్” ట్రైలర్ విడుదల

12 hours ago
నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

నటి దారుణమైన కామెంట్స్ వైరల్!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version