‘ఆంధ్ర కింగ్ తాలూకా'(Andhra King Taluka) గతవారం అంటే నవంబర్ 28న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఓపెనింగ్స్ మాత్రం దారుణంగా వచ్చాయి. మొదటి వారం కనీకష్టంగా 50 శాతం రికవరీ సాధించింది. అందుకు కారణం నవంబర్ డెడ్ సీజన్ అని స్వయంగా హీరో రామ్ ఒప్పుకున్నాడు. వాస్తవం కూడా అదే. గతంలో తాను వెంకటేష్ తో కలిసి చేసిన ‘మసాలా’ సినిమా కూడా నవంబర్లో రావడం వల్ల ఆడలేదు అని రామ్ చెప్పడం జరిగింది.
నిర్మాత మైత్రి రవి కూడా రామ్ చెప్పిన కారణాలతో ఏకీభవించారు. అయితే రెండో వారం తమ సినిమా పికప్ అవుతుందని.. లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అలాంటిదేమీ జరిగేలా లేదు అని అంతా ఫిక్స్ అయ్యారు.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ‘అఖండ 2’ విడుదల నిలిచిపోయింది.రేపు విడుదలవుతుందా? లేదా? అనేది ప్రస్తుతానికి డౌటే అని తెలుస్తుంది.

కొత్త సినిమాలు ఏవీ కూడా ఇప్పటికిప్పుడు రిలీజ్ చేసే పరిస్థితి లేదు.కాబట్టి.. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఒక ఛాన్స్ దొరికినట్టే. కానీ ఈ అవకాశాన్ని వారు క్యాష్ చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఈ శుక్రవారం రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి.. తమ సినిమాకి పుష్ ఇచ్చి ఉంటే.. కచ్చితంగా శని, ఆదివారాలు కొంచెం క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉండేది. దాని వల్లే 2 వారం కూడా రన్ దొరికే ఛాన్స్ ఉండేది. మరి ‘ఆంధ్ర కింగ్..’ నిర్మాతల మనసులో ఏముందో.
