ఆ లెక్క ప్రకారం 2022లో పెద్ద హిట్టు ఈ సినిమానేనా?

2022 సంవత్సరంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఏదనే ప్రశ్నకు చాలామంది ఆర్ఆర్ఆర్ సినిమా పేరును సమాధానంగా చెబుతారు. అయితే బడ్జెట్ కలెక్షన్లపరంగా చూస్తే మాత్రం 2022 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా డీజే టిల్లు నిలవడం గమనార్హం. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమా కలెక్షన్లు మాత్రం 17 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. బడ్జెట్ తో పోల్చి చూస్తే ఈ సినిమా రెట్టింపు లాభాలను అందించింది.

చిన్న సినిమాగా ఫిబ్రవరి 12వ తేదీన విడుదలైన డీజే టిల్లు సినిమా విమల్ కృష్ణ డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ఊహించని స్థాయిలో పాపులర్ అయ్యాయి. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సరైన కంటెంట్ తో చిన్న సినిమాను తెరకెక్కిస్తే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం కష్టం కాదని ప్రూవ్ చేయడం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ 600 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లు సాధించగా కేజీఎఫ్2 గ్రాస్ కలెక్షన్లు ఎక్కువగా ఉన్నా షేర్ కలెక్షన్లు మాత్రం 510 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఈ సినిమాల బడ్జెట్లతో పోల్చి చూస్తే ఈ సినిమాలు రెట్టింపు కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఒక విధంగా ఫెయిల్ అయ్యాయనే చెప్పాలి. డీజే టిల్లు సక్సెస్ తో ఓవర్ నైట్ లో సిద్ధు జొన్నలగడ్డ రేంజ్ కూడా మారింది. ఈ సినిమా సక్సెస్ తో వచ్చిన గుర్తింపు వల్ల సిద్ధు జొన్నలగడ్డ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు సైతం మంచి ఆఫర్లు వస్తున్నాయి.

సిద్ధు కెరీర్ లో మరెన్నో విజయాలను సొంతం చేసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ రాబోయే రోజుల్లో స్టార్ హీరోగా ఎదిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus