యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమాలు.. థియేటర్లలో మంచి ఫలితాలు అందుకున్న సందర్భాలు ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా చూసింది లేదు. అతని గత సినిమాలు ‘మైఖేల్’ ‘గల్లీ రౌడీ’ ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలు రూ.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడానికి కిందా మీదా పడ్డాయి. పోనీ నాన్ థియేట్రికల్ మార్కెట్ ఉందా అంటే అది కూడా అంత అంతంత మాత్రమే. ఇలాంటి మార్కెట్ కలిగిన సందీప్ కిషన్ పై ఏకంగా రూ.27 కోట్లు బడ్జెట్ పెట్టారట.
అదీ ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమాకి..! ఈ మధ్య కాలంలో రవితేజ వంటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలకే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు. అలాంటిది సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకి రూ.27 కోట్లు పెట్టి.. మళ్ళీ దానికి తగ్గ బిజినెస్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అయినా సరే (Ooru Peru Bhairavakona) ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాకి బిజినెస్ వెంటనే జరిగిపోయిందట.
ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ ను ‘ఆదిత్య మ్యూజిక్’ సంస్థ హోల్ సేల్ గా రూ.15 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇక థియేట్రికల్ బిజినెస్ రూ.14 కోట్లకి అయ్యిందట. ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాని ‘సామజవరగమన’ నిర్మాత రాజేష్ దండా నిర్మించారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక మొత్తంగా రూ.2 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్స్ లో ఉంది ఈ సినిమా.