తాజాగా రజినీ కాంత్ – శంకర్ కంబినేషన్లో వచ్చిన విజువల్ వండర్ ‘2.0’.. వీకెండ్ ను బాగానే కాష్ చేసుకున్నప్పటికీ భారీ వసూళ్ళను మాత్రం సాధించలేకపోయిందనడంలో సందేహం లేదు. బయ్యర్లకు కొంత నష్టం వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధాన కారణం రిలీజ్ పలు మార్లు వాయిదా పడుతూ రావడం.. ప్రేక్షకులకు ‘2.0’ పై ఆసక్తిని తగ్గించాయి. సాధారణంగా ఫిబ్రవరి, నవంబర్ లో విడుదలైన చిత్రాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం ఉండవు అనేది తెలిసిన విషయమే.
లాంగ్ వీకెండ్ ను బేస్ చేసుకుని తెలుగు వెర్షన్ వరకూ కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఆదివారం ఒక్క రోజునే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్లకు పైగా షేర్ ను రాబట్టి డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. వీకెండ్ పూర్తిచేసుకునేసరికీ ఈ చిత్రం దాదాపు 33 కోట్ల షేర్ ను రాబట్టినప్పటికీ.. 70 కోట్ల వరకూ తెలుగులో కొనుగోలు చేసిన కారణంగా సకానికి పైనే నష్టాలు రావడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు.
‘2.0’ వీకెండ్ కొల్లెక్షన్ల ఈ విధంగా ఉన్నాయి
నైజామ్ – 13 కోట్ల 70 లక్షలు
సీడెడ్ – 4 కోట్ల 90 లక్షలు
ఉత్తరాంధ్ర – 4 కోట్ల 28 లక్షలు
గుంటూరు – 2 కోట్ల 59 లక్షలు
ఈస్ట్ గోదావరి – 2 కోట్ల 46 లక్షలు
వెస్ట్ గోదావరి – 1 కోటి 71 లక్షలు
కృష్ణా – 2 కోట్లు
నెల్లూరు – 1 కోటి 36 లక్షలు
తెలుగు రాష్ట్రాలు 4 రోజుల టోటల్ షేర్ – 33 కోట్లు
తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లే వచ్చినప్పటికీ తమిళనాడులో మాత్రం ‘2.0’ తడబడుతుంది. తొలి మూడు రోజుల్లో కేవలం 34 కోట్లు మాత్రమే రాబట్టిన ‘2.0’ కొన్ని ఏరియాల్లో ‘సర్కార్’ కలెక్షన్లను మ్యాచ్ చేయడానికి కూడా అష్టకష్టాలు పడుతుందట. తమిళ్ లో ఈ చిత్రం క్లోసింగ్ కలెక్షన్లు ‘సర్కార్’ ‘మెర్సల్’ ను దాటే అవకాశం లేదంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఇక ఈ చిత్రానికి అసలు పరీక్ష ఈరోజు నుండీ మొదలు కానుంది. బ్రేక్ ఈవెన్ కావాలంటే వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్లు రాబట్టలసింది. అయితే ‘3D’ లో మాత్రమే ఈ చిత్రాన్ని చూడండి అని శంకర్ చెప్పడం వల్లనేమో కానీ ‘2D’ ప్రదర్శిస్తున్న థియేటర్లు మాత్రం ఫుల్స్ పడట్లేదంట. ఇది ఒక లోపం అనుకుంటే.. ప్రస్తుతం పెద్ద సినిమాలేమి లేకపోవడం ‘2.0’ కలిసొచ్చే అంశం అనడంలో సందేహం లేదు. దీనిని ‘2.0’ ఎంతవరకూ కాష్ చేసుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.