Kushi: దర్శకుడు భలే స్మూత్ గా హ్యాండిల్ చేశాడుగా..!

తెలుగు సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఖుషి సినిమా ట్రైలర్ వచ్చింది. విజయ్ దేవరకొండ – సమంత కాంబినేషన్లో మైత్రి మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ట్రైలర్ క్వాలిటీ పరంగా బాగుంది. మంచి విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు ఇలా అంతా బాగుంది. అయితే కంటెంట్ పరంగా చూస్తే కాస్త రెగ్యులర్ అనిపిస్తోంది. టాలీవుడ్ లో గతంలో వచ్చిన కొన్ని సినిమాలను మిక్స్ చేసి ఖుషి సినిమా తెరకెక్కించారా ? అన్న సందేహాలు అయితే వస్తున్నాయి.

కాశ్మీర్ వెళ్లిన కుర్రాడికి ఓ ముస్లిం అమ్మాయి కనిపించటం.. వెంటపడి ప్రేమించడం అన్నీ కలిసి గతంలో వచ్చిన దేశముదురు చాయ‌లను గుర్తుచేసాయి. కట్ చేస్తే ఆ అమ్మాయి బేగం కాదు బ్రాహ్మణ అన్నది ట్విస్ట్. అడ్డబొట్టు పెట్టి బ్రాహ్మిన్స్ అని చెప్పే ప్రయత్నంతో.. అమ్మాయి తరఫు వారి పరిచయం ఆఖరికి పెళ్లి ఇవన్నీ కూడా ఇటీవల వచ్చిన నాని అంటే సుందరానికి సినిమాను గుర్తు చేస్తున్నాయి.

కట్ చేస్తే ఇద్దరి మధ్య మనస్పర్ధలు.. అపార్ధాలు.. ఆవేదనలు.. పెళ్లి ఇదంతా విజయ్ బ్లాక్ బస్టర్ సినిమా గీతగోవిందం టచ్ కనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ చెబుతోంది ఏంటంటే రెగ్యులర్ కంటెంట్. అయితే శివ కథనం స్మూత్ గా ఉంటుంది.. సున్నితంగా ఉంటుంది. కథనంతో మ్యాజిక్ చేస్తే సినిమా ఖచ్చితంగా హిట్ అయ్యే లక్షణాలు ఉన్నాయి.

మరి శివ మ్యూజిక్ కు తోడు సమంత – విజయ్ జంట పెర్ఫార్మన్స్ ఎలా ఉంది ఇవన్నీ రేపు సినిమా రిలీజ్ అయ్యాక తేలిపోనున్నాయి. ఓవరాల్ గా చూస్తే పాన్‌ ఇండియా అంటే కష్టమే గానీ తెలుగు వరకు ఈ సినిమా (Kushi) సక్సెస్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags