‘బిగ్‌బాస్’ (Bigg Boss 8 Telugu) హౌస్ కి కొత్త చీఫ్ గా సీత (Kirrak Seetha) ఎంపికైంది. ఈ క్రమంలో క్లాన్ సభ్యులను ఎంపిక చేసుకునే ఛాన్స్… రెండు క్లాన్ టీమ్ సభ్యులకి మరోసారి టీమ్స్ సెలక్ట్ చేసుకునే ఛాన్స్ బిగ్‌బాస్ ఇచ్చాడు. సీత టీం అంటే కాంతార టీంలో విష్ణుప్రియ (Vishnu Priya), నైనిక(Nainika), ,నబీల్ (Nabeel Afridi) , ఆదిత్య (Aditya OM), యష్మీ (Yashmi Gowda) వంటి వారు ఉన్నారు. ఇక శక్తి టీంలో అంటే నిఖిల్ (Nikhil) టీమ్‌లో సోనియా, పృథ్వీ (Prithviraj) మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో సీత టీంలో ఎక్కువ మంది ఉండడంతో… స్వాప్ సిస్టం పెట్టాడు బిగ్ బాస్.
Bigg Boss 8 Telugu
మణికంఠ (Naga Manikanta) .. సీత టీంలో ఉండాలంటే.. తన ప్లేస్ లో ఎవరొకరు ‘శక్తి’ టీంలోకి వెళ్ళాలి. ఇందుకు సీత.. ‘నా టీంలోకి వచ్చిన వాళ్ళు ఇష్టపడి వచ్చారు కాబట్టి.. ఎవ్వరినీ నేను ఒప్పించి ఆ టీంలోకి పంపలేను… ‘నెక్స్ట్ టైం చూద్దాం’ అని చెప్పి మణికంఠని శక్తి టీంలోకి పంపేసింది. ఆ తర్వాత ప్రేరణ (Prerana).. మిగిలిపోతే ‘శక్తి’ టీంలోకి వెళ్లాలని బిగ్ బాస్ పిలుపునిచ్చాడు. అందుకు ప్రేరణ… ‘అందరినీ ఛాన్స్ ఇచ్చి.. చివరికి నాకు ఛాన్స్ లేకుండా చేశారు. ఇదేం అన్యాయం బిగ్ బాస్?’ (Bigg Boss 8 Telugu) అంటూ ఎమోషనల్ అయ్యింది.
అందుకు యష్మీ.. ‘త్యాగం చేసి శక్తి టీంలోకి వెళ్ళింది. ప్రేరణ ‘కాంతార’ అంటే సీత టీంలో చేరింది. యష్మీ నిర్ణయం సోనియాకి పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే.. సోనియా, యష్మీ ..లకి అస్సలు పడదు కాబట్టి..! ఇక టీం సభ్యుల ఎంపిక విషయంలో తర్వాత హౌస్మేట్స్ వద్ద చాలా డిస్కషన్లు జరిగాయి. ముఖ్యంగా అర్ధరాత్రి నిఖిల్-సోనియా-పృథ్వీ సోఫాలో కూర్చుని ఈ విషయంపై ముచ్చటించుకున్నారు. “మన ముగ్గురి మధ్య ఏమున్నా సరే అది మన ముగ్గురిలోనే ఉండాలి.
మన టీంలోకి వచ్చిన ఇద్దరు ఖచ్చితంగా పాయింట్స్ రెయిజ్ చేస్తారు” అంటూ నిఖిల్ అంటే.. అందుకు సోనియా…. ‘వాళ్లిద్దరూ(మణికంఠ,యష్మీ) స్పై..లానే బిహేవ్ చేస్తారు..’ అంటూ సోనియా అంది. తర్వాత నిఖిల్… ” మణికంఠ ఎలా ఉన్నా.. యష్మీ మన టీంలోకి వచ్చింది మనం రాంగ్ అని ప్రూవ్ చేయడానికే..! నెగిటివ్..పాజిటివ్ పక్కన పెట్టేస్తే.. ఈరోజు టీమ్ సెలక్షన్‌తో నాకు ఓ క్లారిటీ వచ్చింది. అదేంటంటే మనం ‘త్రీ Vs హౌస్’ అని” అంటూ పలికాడు.
అందుకు పృథ్వీ .. “నీకు ఇంత లేటుగా అర్థమైందా” అని అన్నాడు. అప్పుడు నిఖిల్ మళ్ళీ.. “అలా కాదు నిన్ను,నన్ను(సోనియాని పక్కన పెట్టి) ఇష్టపడే వాళ్ళు కూడా నా టీంలోకి రాలేదు. కానీ నువ్వంటే(పృథ్వీ) అంటే పడని మణికంఠ, సోనియా అంటే ఇష్టం లేని యష్మీ మన టీంకి రావాల్సి వచ్చింది. అందుకు నేను అనేది. ఎవరితో ఎంత లిమిట్లో ఉండాలో ఈరోజు నాకు బాగా క్లారిటీ వచ్చింది” అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు.