నవంబరు నెల రెండో వారం కూడా థియేటర్ల వద్ద సందడి అంతంతమాత్రంగానే ఉండబోతోంది. దీనికి కారణం స్టార్ హీరోల సినిమాలు లేవని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆసక్తికర సినిమాలు రాబోతుండటంతో.. మరీ డల్లుగా ఏం ఉండదు. అలా ఈ వారం టీవీ, ఓటీటీల్లో ఏయే సినిమాలు రాబోతున్నాయో చూసేయండి.
* న్యాయం కోసం ఎదిరించేవాడే బలవంతుడు అంటూ అల్లరి నరేశ్ ఈ శుక్రవారం రాబోతున్నాడు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అంటూ 25న నరేశ్, ఆనంది వస్తున్నారు. ‘నాంది’తో ఇమేజ్ మార్చుకున్న నరేశ్.. ఇప్పుడు దాన్ని ఎక్స్‌టెండ్ చేసేలా ఈ కథ ఎంచుకున్నాడు. మరి జనాలు ఏం చేస్తారో చూడాలి. ఏఆర్ మోహన్ దర్శకుడు కాగా, రాజేష్ దండా నిర్మాత.
* మనిషి తోడేలుగా మారితే.. అంటూ గత కొద్ది రోజులుగా ఓ బాలీవుడ్ సినిమా ఆసక్తి రేకెత్తిస్తోంది. అదే ‘తోడేలు’.. హిందీలో ‘భేడియా’గా వస్తోంది. వరుణ్ ధావన్, కృతి సనన్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. ఆయన రీసెంట్ ట్రాక్ రికార్డు చూస్తుంటే ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి అనిపిస్తోంది.
* హిట్ సినిమాల్ని పట్టుకుని తెలుగులో డబ్బింగ్ చేస్తే మంచి ఫలితాలే వస్తున్నాయి మన దగ్గర. ఈ ట్రెండ్‌లో దిల్ రాజు తీసుకొస్తున్న చిత్రం ‘లవ్‌టుడే’ ప్రదీప్ రంగనాథన్ నటించి తెరకెక్కించిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. 25న థియేటర్‌లలో అదే పేరుతో రాబోతోంది. ఇవానా కథానాయికగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్‌రాజా సంగీత దర్శకుడు.
* వీటితోపాటు ఈ వారం కొన్ని చిన్న సినిమాలు కూడా రెడీ అయ్యాయి. నవంబర్ 25న ‘వల’, ‘మన్నించవా’ , చెడ్డి గ్యాంగ్ తమాషా లాంటి చిత్రాలు రాబోతున్నాయి. 26న ‘రణస్థలి’ వస్తుంది. ఈ శుక్రవారం హిందీలో మరో సినిమా ‘కొరా కాగజ్’ కూడా వస్తోంది. రజత్ కపూర్, స్వస్తిక ముఖర్జీ, ఐషాని యాదవ్ తదితరులు నటించారు.
* తమిళంలో ఎం.శశికుమార్, అమ్ము అభిరామి నటించిన ‘కారి’… సంతానం నటించిన కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ‘ఏజెంట్ కన్నయిరమ్… అథర్వ మురళి ‘పట్టతు అరసన్’.. ‘గిలా ఐలాండ్’, 4 ఇయర్స్ నవంబర్ 25న విడుదలవుతున్నాయి.
* కన్నడలో గణేష్ ‘ట్రిపుల్ రైడింగ్’ ‘రోగ్’ ఫేమ్ ఇషాన్ ‘రెమో’తోపాటు మరో చిన్న సినిమా ‘సద్దు విచారణే నడియుత్తిదే’, ఉన్ని ముకుందన్ ‘షిఫీకింటే సంతోషం’ 25న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఇక ఓటీటీ సంగతి చూస్తే…
* శివకార్తికేయన్, అనుదీప్ కేవీ కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రిన్స్’ నవంబరు 25న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రాబోతోంది. ది గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలీడే స్పెషల్ (హాలీవుడ్) కూడా ఆ రోజే తీసుకొస్తున్నారు.
* నేచురల్ స్టార్ నాని సోదరి దీప్తి తెరకెక్కించిన ‘మీట్ క్యూట్’ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో నవంబరు 25న రానుండగా, గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) కూడా అదే రోజు వస్తుంది.
* నెట్‌ఫ్లిక్స్‌లో నవంబరు 23న వెన్స్‌డే (వెబ్‌సిరీస్), ది స్విమ్మర్స్ (హాలీవుడ్), గ్లాస్ ఆనియన్ (హాలీవుడ్), బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్) రాబోతున్నాయి. 25న ది నోయల్ డైరీ (హాలీవుడ్), ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్), పడవేట్టు (మలయాళం) వస్తున్నాయి.
* అమెజాన్ ప్రైమ్‌లో గుడ్ నైట్ ఊపీ (మూవీ) నవంబరు 23న వస్తోంది. జీ5లో చుప్ (బాలీవుడ్) నవంబరు 25న వస్తోంది. ఆహాలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు సినిమా) నవంబరు 25న స్ట్రీమ్ అవుతుంది.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!