SSMB28: ‘మహేష్ 28’ లో బాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే?

మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ కాంబోలో ‘అతడు’ ‘ఖలేజా’ వంటి చిత్రాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలకి థియేటర్లలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు. ‘అతడు’ కిందా మీదా పడి హిట్టు కొట్టింది. ‘ఖలేజా’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది.అయినా సరే వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూడో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శాటిలైట్ రైట్స్ ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటు చెల్లించి దక్కించుకుంది.

అయితే ఇంకా ఈ చిత్రం షూటింగ్ పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మొదటి షెడ్యూల్ రెండు సార్లు ప్రారంభమయ్యి ఆగిపోయింది. మహేష్ విదేశాలకు టూర్ కు వెళ్ళిపోయాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ చిత్రంలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, శ్రీలీల ఎంపికయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్ ను ఎంపిక చేసుకున్నట్టు ఇన్సైడ్ టాక్. వివరాల్లోకి వెళితే.. భూమి పెడ్నేకర్ అనే బాలీవుడ్ బ్యూటీని ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నారట.

2015లో ఎంట్రీ ఇచ్చిన భూమి పెడ్నేకర్ రెగ్యులర్ గా ఉండే రోల్స్ కాకుండా డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తుంది. అవసరమైతే ఇంటిమేట్ సన్నివేశాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. మహేష్ 28లో ఓ అరగంట కనిపించే పాత్ర కోసం ఈమెను సంప్రదించారట. పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి భూమి పెడ్నేకర్ ను ఎంపిక చేసుకోవాలనే నిర్ణయానికి త్రివిక్రమ్ అండ్ టీం వచ్చినట్టు స్పష్టమవుతుంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 లోనే సినిమా రిలీజ్ అవుతుంది. లేదంటే 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవ్వొచ్చు. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus