శ్రీకాంత్ అడ్డాల.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘కొత్త బంగారు లోకం’ వంటి యూత్ ఫుల్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘ముకుంద’ ‘బ్రహ్మోత్సవం’ వంటి ఫ్యామిలీ సినిమాలు ఇతని డైరెక్షన్లో రూపొందాయి. ఇందులో ‘బ్రహ్మోత్సవం’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా ఇతన్ని 5 ఏళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరమయ్యేలా చేసింది.తర్వాత వెంకటేష్… ‘నారప్ప’ చేసే ఛాన్స్ ఇచ్చారు. అది ఓటీటీకి వెళ్లి సేఫ్ అయ్యింది.
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ (Peddha Kapu) `పెదకాపు` త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది ఒక పీరియాడిక్ ఫిలిం.అప్పట్లో గోదావరి జిల్లాల్లోని రాజకీయాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ చిత్రాన్ని కంప్లీట్ గా రా అండ్ రస్టిక్ మోడ్ లో తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. టీజర్ చూస్తే ఈ విషయం ఈజీగా అర్ధమవుతుంది. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇక ఈ చిత్రం కోసం ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ పెట్టాడట నిర్మాత. ‘అఖండ’ చిత్రాన్ని తెరకెక్కించిన మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత.
అయితే శ్రీకాంత్ అడ్డాలని నమ్మి అంత డబ్బు ఎలా పెట్టాడు అనే డౌట్ అందరికీ ఏర్పడింది. ‘అఖండ’ కి వచ్చిన లాభాలు అన్నీ ఈ చిత్రం కోసం పెట్టేసాడా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో నటించిన హీరో విరాట్.. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి దగ్గర బంధువు. అందుకే ఇంత బడ్జెట్ పెట్టాడు అని స్పష్టమవుతుంది. ఇంకో విచిత్రం ఏంటంటే.. ‘పెదకాపు – 1 ‘ లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ ముఖ్య పాత్ర పోషించాడు.