Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 : నామినేషన్స్ లో ప్రేరణ – నైనిక..ల మధ్య లొల్లి.!

‘బిగ్‌బాస్ 8’ 4వ వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం వచ్చింది అంటే నామినేషన్ల వాడీవేడీ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే నామినేషన్స్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ఉంటాడు బిగ్ బాస్. ఈ వారం కూడా ఒక్కో హౌస్మేట్ ఇద్దరి ఇద్దరిని నామినేట్ చేయవచ్చు.ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళ మొహం పై ఫోమ్ (నురగ) కొట్టాలి అనేది రూల్. నిఖిల్ (Nikhil)  చీఫ్ కాబట్టి..అతన్ని నామినేట్ చేయకూడదు అనే నిబంధన ఉంది.

Bigg Boss 8 Telugu

ఇక నామినేషన్స్ ఆరంభంలో.. ఆదిత్య . (Aditya OM) ..పృథ్వీ (Prithviraj)  ,సోనియా..లను నామినేట్ చేశాడు. తర్వాత నైనిక (Nainika), మణికంఠ  (Prithviraj)  ,ఆదిత్య..లని నామినేట్ చేసింది. నబీల్ (Nabeel Afridi).. సోనియా, పృథ్వీ..లను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో ‘ప్రేరణ (Prerana) వచ్చి.. మణికంఠని నామినేట్ చేసింది.

అదే టైంలో ఆమె నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో.. ఎలా బిహేవ్ చేస్తావో అర్థం కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత ఆమె నైనికని నామినేట్ చేసింది. అందుకు ప్రేరణ కారణం చెబుతూ.. ” నువ్వు కొంచెం సైలెంట్ అయ్యావ్.. కొన్ని టాపిక్స్‌లో ఇమ్మెచ్యూర్‌డ్గా ఉన్నావ్..

నీ గేమ్ నాకు కనిపించట్లేదు.. హౌస్‌లో ఎందుకో చాలా సైలెంట్‌గా ఉంటున్నావ్..” అంటూ చెప్పుకొచ్చింది.ఇందుకు నైనిక.. ‘గొడవలు పడాలా అయితే’ అంటూ ప్రశ్నించింది. ఇందుకు ప్రేరణ ‘నేను విష్ణుప్రియను (Vishnu Priya) ఏదో అంటే చెంప పగలగొట్టాల్సింది’ అంటూ సలహా ఇచ్చావ్.

అది నాకు ఇమ్మెచ్యూర్‌డ్గా అనిపించింది’ అంటూ జవాబిచ్చింది. తర్వాత నైనిక.. ” నా ముందుకొచ్చి ఎవరైనా క్యారెక్టర్ లెస్ అనే మాట అంటే నేను పక్కా కొడతా.. ఆ తర్వాత ఏమైతే అది అవుతుంది..” అంటూ ఘాటుగా ప్రేరణకి సమాధానం ఇచ్చింది నైనిక.

13 ఏళ్ళ ‘దూకుడు’ మూవీ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus