“నాన్నకు ప్రేమతో” హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్నయాక్షన్ ఫిల్మ్ జనతా గ్యారేజ్. కొరటాల శివ హ్యాట్రిక్ అందుకోవడానికి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ రెండురోజుల క్రితం విడుదలై సంచలనం సృష్టిస్తోంది. అర నిముషం నిడివిగల ఈ వీడియోని పరిశీలిస్తే .. ఎన్నో ఆసక్తికర సంగతులు ఉన్నట్లు గుర్తించవచ్చు. అవేమిటంటే..
1. టీజర్ ప్రారంభంలో తారక్ బ్యాగ్ తో పరిగెత్తుకు వస్తుంటారు.. ఇది సినిమాలో హీరో ముంబైలో ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్ లైఫ్ ని సూచిస్తుంది. అతను నడిచే విధానం, పరిగెత్తే తీరు పరిశీలిస్తే గుండెలో ప్రళయం లాంటి నిజమేదో దాచుకుని ఉన్నట్లు అనిపిస్తుంది.
2. రెండో షాట్ లోనే యంగ్ టైగర్ బైక్ పై వస్తుంటారు. స్టూడెంట్ ఎన్టీఆర్ కి, బైక్ పైన ఉన్న ఎన్టీఆర్ కి తేడా స్పష్టంగా ఉంది. ఇప్పుడు గడ్డం కొంచెం ఎక్కువగా పెరిగింది. అంటే ఇది స్టూడెంట్ ఆఫ్టర్ లైఫ్ ని తెలుపుతుంది.
3. తర్వాత ఫైట్ సీన్.. లైబ్రరీ లో జరిగింది అని చాలామంది అనుకున్నారు. కానీ అక్కడ స్టూడెంట్స్ లేరు. ఉద్యోగులే ఉన్నారు. అంటే అదొక ప్రభుత్వ కార్యాలయమని చెప్పొచ్చు.
4. ఈ సినిమాలో ఎన్టీఆర్ మిత్రుడు రాజీవ్ కనకాల కూడా ఉన్నారు. లైబ్రరీ లో జరిగే యాక్షన్ సీన్లో అతన్ని గమనించవచ్చు.
5. స్టూడెంట్ నెంబర్.1, సింహాద్రి సినిమాల్లోని విధంగా ఒక బలమైన ఫ్లాష్ బ్యాక్ జనతా గ్యారేజ్ లోను ఉన్నట్లు ఈ టీజర్ స్పష్టంగా తెలుపుతోంది.