Sankranti: సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు ..ఈ సంక్రాంతి ఫ్యాన్స్ కు జాతరే..!

టాలీవుడ్ లో ఈ సారి సంక్రాంతి కొత్తగా ఉండబోతుంది..సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు, కొత్త కోడలు, కోడిపందేలుతో జోరుగా ఉంటుంది. అయితే జోరుకు 5 స్టార్ హీరోల సినిమాలు కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి.. ఈ సంక్రాంతి (Sankranti0 బరిలో నిలిచేది ఏ హీరోనే చూడాలి.

ఈగిల్

ఈ సంక్రాంతికి మాస్ మహారాజా రవితేజ ఈగిల్ అనే టైటిల్ తో బరిలో దిగుతున్నాడు.. ఈ విషయాన్ని సోమవారం (జూన్ 10) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రవితేజ అనౌన్స్ చేశాడు. “ఈసారి కాస్త యాక్షన్ ను ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఈగిల్ లెట్స్ కిల్. సంక్రాంతికి కలుద్దాం” అనే క్యాప్షన్ తో రవితేజ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వన్ హీరోయిన్‍గా ఉంటుందని టాక్.

గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి పలు రకాల అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి.. ఇందులో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తూ ఉండగా మరొక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తోంది. ఈ సినిమాను జనవరి 12న రిలీజ్‌ ప్రేక్షకుల ముందుకు రానున్నంది.

హనుమాన్

టాలీవుడ్‌లో ఫాంటసీ కథలతో వచ్చిన సినిమాలు చాలా తక్కువ అనే చెప్పాలి. గ్రాఫిక్స్ ప్రధానంగా తీసే చిత్రాల్లో రాజమౌళి ఫెర్ఫెక్ట్. మిగతా దర్శకులు అలాంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడుతున్నారు. ప్రేక్షకులతో తిట్లు తింటున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్లందరూ ఓ సినిమా కోసం కాస్తంత ఎక్కువగానే ఎదురుచూస్తున్నారు. అదే ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’. తాజాగా ఈ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన‍్ని థియేటర్లలో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

నా సామిరంగ

నాగ్ కెరీర్ లో 99వ సినిమాగా రానున్న మూవీని ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్నీతెరకెక్కించనున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్నా ఈ సినిమాకు నా సామిరంగ అనే మాసీ టైటిల్ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సంధర్బంగా చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ గ్లింప్స్ లో నాగార్జున లుంగీ కట్టుకొని, బీడీ కాలుస్తూ మాస్ అవతారంలో కనిపించారు. ఈ సినిమా 2024 సంక్రాంతి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విడి 13

గీతగోవిందం సినిమాతో వన్‌ ఆప్‌ ది క్రేజీయెస్ట్‌ కాంబినేషన్‌గా నిలిచింది పరశురాం, విజయ్‌ దేవరకొండ . ఈ ఇద్దరి కలయికలో రెండో సినిమా వస్తుందని తెలిసిందే. విజయ్‌-పరశురాం విడి 13 ప్రాజెక్ట్‌ జూన్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. హై బడ్జెట్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న విడి 13లో సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. విడి 13 మూవీని 2024 సంక్రాంతి కానుకగా 13న విడుదల చేయనున్నట్టు ప్రకటించేశారు మేకర్స్‌.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus