బిగ్ బాస్ 4: అవినాష్ గేమ్ ఎక్కడ బెడిసికొట్టింది..!

బిగ్ బాస్ హౌస్ లో ఫుల్ ఎంటర్ టైన్ చేసిన అవినాష్ జెర్నీ ఎట్టకేలకి ముగిసింది. జెర్నీ చూస్తుంటే అవినాష్ నిజంగా 100 పర్సెంట్ జెన్యూన్ గా గేమ్ ఆడాడు. ఎంతమంది ఎన్నివిధాలుగా మాట్లాడినా కూడా తనదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేశాడు. నిజానికి బయటకి వస్తే బతుకులేదు అని ఏదైతే అనుకున్నాడో అది తప్పు అని ఆడియన్స్ ప్రూవ్ చేసాడు. హౌస్ లో ఉన్న ఆడవాళ్లని చూసి నాకు ధైర్యం వచ్చిందని చెప్పాడు. అన్నట్లుగానే బ్రేవ్ హార్ట్ తో బయటకి వచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో రోబో టాస్క్ దగ్గర్నుంచి, రేస్ టు ఫినాలే టాస్క్ వరకూ అన్ని టాస్క్ లలో తనదైన పెర్ఫామెన్స్ ఇచ్చాడు అవినాష్. అంతేకాదు, కెప్టెన్సీ రేసులో కూడా నిలబడ్డాడు. హౌస్ లో ఒకసారి కెప్టెన్ కూడా అయ్యాడు. చాలా లాంగ్ జెర్నీ బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ ది. అయితే, కొన్ని కొన్ని మిస్టేక్స్ వల్ల కాస్త వేరేవాళ్లకంటే కూడా వెనకబడిపోయాడు. రేస్ లో ముందుకెళ్లలేకపోయాడు. అవినాష్ ఎలిమినేట్ అవ్వడానికి బిగ్ బాస్ గేమ్ పరంగా మనం కొన్ని కారణాలు చూసినట్లయితే,,

1. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లలో కి వచ్చేసరికి కాస్త ఫోకస్ తగ్గిపోయింది. పల్లెకిపోదాం టాస్క్ లో కిళ్లీ కొట్టు యజమానిగా ఉండి హారిక వచ్చి రెచ్చగొట్టేసరికి రెచ్చిపోయాడు. తన దుకాణం తానే పాడు చేసుకున్నాడు. అలాగే, చాలా టాస్క్ లో గెలవలేనపుడు కొద్దిగా ఆర్గ్యూమెంట్ కూడా పెట్టుకున్నాడు. బిబి హోటల్ టాస్క్ లో సీక్రెట్ టాస్క్ మాత్రం బాగా ఫినిష్ చేసినా అది హైలెట్ అవ్వలేకపోయింది. ఇక టాస్క్ లలో ఎక్కడైనా గొడవజరిగినా , నామినేషన్స్ లో హీట్ పుట్టించే ఆర్గ్యూమెంట్స్ అవుతున్నా కూాడ తను ఎక్కడా ఎవరితరపునా స్టాండ్ అనేది తీసుకోలేకపోయాడు.

2. అవినాష్ వేసిన జోక్స్ ప్రారంభంలో అందర్నీ ఇబ్బంది పెట్టాయి. మోనాల్, తర్వాత అఖిల్, అభిజిత్ హారికలు కూడా దీనిపై చాలాసార్లు అవినాష్ ని హెచ్చరించారు కూడా. ఇక నోయల్ అయితే, వెళ్లిపోతూ అవినాష్ ఎలా తనని ఎగతాళిగా ఇమిటేడ్ చేశాడు. ఎలా జోకులు వేసాడు అనేది చెప్పాడు. అమ్మరాజశేఖర్, అవినాష్ ఇద్దరూ కూడా వివరణ ఇస్తున్నా కూడా వినిపించుకోలేదు. అదేవారం నామినేషన్స్ లో చేసిన కమ్యూనికేషన్ కూడా అవినాష్ గేమ్ ని దెబ్బతీసింది. మిమిక్రీ చేయడం తప్పా అనే రాంగ్ కమ్యూనికేషన్ లోకి అవినాష్ వెళ్లిపోయాడు.

3. ఎమోషనల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని చూడడం కూడా గేమ్ ని దెబ్బతీసింది. నిరుత్సాహం, అసహనం, ఆవేదన, అర్ధం లేని ఎమోషన్ అనేవి గేమ్ ని దెబ్బతీసాయి. బయట షోస్ లేవని చెప్పడం, సూసైడ్ చేస్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని అమ్మరాజశేఖర్ తో మాట్లాడటం పదే పదే ఎమోషనల్ అయిపోవడం. బయటకి వస్తే బ్రతుకులేదు అనే భావనతో లో కాన్ఫిడెన్స్ తో ఉండటం అనేది మైనస్ అయ్యింది.

4. అమ్మరాజశేఖర్ మాస్టర్ తో కలిసి ఎలిమినేషన్ అయినంత పని అయ్యేసరికి భయపడటంతో ఆ తర్వాత గేమ్ పైన ఫోకస్ తగ్గింది. నామినేషన్స్ లోకి రావడానికి భయపడటం అనేది కూడా గేమ్ ని దెబ్బతీసిందనే చెప్పాలి. మరోకటి ఏంటంటే తనకంటే వీక్ కంటెంస్టెంట్ అంటూ వేరే వాళ్లని అడ్రస్ చేసి చెప్పడంతో అవినాష్ కి ఎదురుదెబ్బ తగిలింది.

5. గేమ్ లో టాస్క్ లో దూసుకుపోతూ ఎదుటివారి పెర్ఫామెన్స్ ని తక్కువ అంచనా వేయడం కూడా అవినాష్ కి మైనస్ అయ్యింది. ఎదుటి వారి గేమ్ ని ఎనలైజ్ చేయలేకపోడు అవినాష్. తనకంటే ఎవరు మెరుగ్గా ఆడుతున్నారో నోటీస్ చేయలేకపోయాడు. మిగతా హౌస్ మేట్స్ గేమ్ తన గేమ్ ని డామినేట్ చేస్తున్నా గమనించుకోలేకపోడు. వేరే వాళ్ల బలాలని, బలహీనతలని గ్రహించలేకపోయాడు. ఫైనల్ గా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.

మొత్తానికి ఈ సీజన్ లో అవినాష్ చాలాబాగా ఎంటర్ టైన్ చేశాడనే చెప్పాలి. లాస్ట్ సీజన్ లో శ్రీముఖి – బాబాభాస్కర్ మాస్టర్ ఎలా అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ చేశారో, అలాగే ఈసారి అవినాష్ సోలోగా సీజన్ 4 లో దుమ్మురేపాడు. బయట ఎంతో మంది అభిమానుల మనసులని గెలుచుకున్నాడు.

[yop_poll id=”1″]
Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus