జాతీయ వేదిక మీద మరోసారి తెలుగు సినిమాలు మెరిశాయి. ఇటీవల ప్రకటించిన 67వ (2019) జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో రెండు తెలుగు సినిమాలు మెరిశాయి. ఉత్తమ చిత్రం (తెలుగు)గా ‘జెర్సీ’ నిలిచింది. వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’ పురస్కారం సాధించింది. ‘జెర్సీ’ సినిమాకు పని చేసిన ఎడిటర్ నవీన్ నూలికి ఉత్తమ కూర్పు పురస్కారం దక్కింది. ‘మహర్షి’లో ‘పదర పదర.. పదరా’ పాటకు నృత్య రీతులు సమకూర్చిన రాజు సుందరానికి కొరియోగ్రఫీలో ఉత్తమ పురస్కారం దక్కింది. అలా వ్యవసాయం నేపథ్యంలో రూపొందిన ‘మహర్షి’కి రెండు, క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ‘జెర్సీ’కి రెండు అవార్డులు వచ్చాయి.
ఇక జాతీయ ఉత్తమ చిత్రం మలయాళంలో రూపొందిన ‘మరక్కర్’ పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ నటులుగా ఈ సారి ఇద్దరిని ప్రకటించారు. ‘అసురన్’లో నటనకుగాను ధనుష్, ‘భోంస్లే’చిత్రానికి మనోజ్ బాజ్‌పాయీ ఉత్తమ నటుడు పురస్కారం పొందారు. ఇక నాలుగోసారి కంగన ఉత్తమ నటిగా నిలిచింది. ఈ సారి ‘మణికర్ణిక’, ‘పంగా’ చిత్రాల్లో నటనకు ఈ పురస్కారం ఇచ్చారు. ఉత్తమ తమిళ చిత్రంగా ‘అసురన్’ నిలవగా, ఉత్తమ హిందీ చిత్రంగా ‘చిచ్చోరే’ నిలిచింది. ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్’ నిలిచాడు.
మరిన్ని పురస్కారాల వివరాలు ఇవీ…
ఉత్తమ మలయాళ చిత్రం – కళ్లం ఒట్టమ్
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – గిరీష్ గంగాధరన్ (జల్లికట్టు)
ఉత్తమ మ్యూజిక్ (సాంగ్స్) – విశ్వాసం (డి. ఇమ్మాన్)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ – విక్రమ్ మోర్ (అవనే శ్రీమన్నారాయణ)
ఉత్తమ మేకప్ – రంజిత్ (మలయాళం – హెలెన్ )
ఉత్తమ డెబ్యూ దర్శకుడు – మాతుకుట్టి జేవియర్ (హెలెన్ – మలయాళం)
ఉత్తమ బాల నటుడు – నాగ విశాల్ (కేడీ – తమిళం)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ – మరక్కర్ (మలయాళం)
ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్ – సిక్కిం
ఇవి కాకుండా తెలంగాణ యువకులు మరాఠీలో రూపొందించిన ‘లతా భగవాన్ కరే’ చిత్రానికి జాతీయ పురస్కారం దక్కింది. స్పెషల్ మెన్షన్ విభాగంలో ప్రశంసా పత్రం దక్కించుకుంది. భర్తని బతికించుకోవడానికి మహారాష్ట్రలోని పింప్లీలో ఓ వృద్ధురాలు (లతా కరే) చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు నవీన్ దేశబోయిన కరీంనగర్‌కు చెందిన వ్యక్తి. నిర్మాత యర్రబోతు కృష్ణది భువనగిరి.
Most Recommended Video
చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!