సబ్జెక్టు ఏదైనా రాజమౌళి డీల్ చేస్తే వెండితెరపై పండాల్సిందే. ఆయన ఇప్పటివరకు యూత్ ఫుల్ సబ్జక్ట్స్ నుండి ఫాంటసీ, పీరియాడిక్ మరియు మాస్ యాక్షన్ ఎంటెర్టైనర్స్ అన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ హిస్టారిక్ పాత్రలకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్… కొమరం భీమ్, అల్లూరి పాత్రలు చేస్తుండగా పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది. బాహుబలి తరువాత రాజమౌళి నుండి వస్తున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొనివుంది. తెలుగు వారు గర్వించదగ్గ మరో మూవీ రాజమౌళి నుండి రానుంది అని చాలా మంది ఫిక్స్ అయిపోయారు.
అసలు ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎందకు చూడాలి..? ఆర్ ఆర్ ఆర్ మూవీకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటనేది మాకు తెలిసిన నాలెడ్జ్ తో కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాం.. అవేమిటో చూద్దాం..
ఆ వీరులను ఈ జనరేషన్ కి గుర్తు చేస్తున్నారు.
చరిత్రలో దేశ భక్తులు అంటే మనకు గుర్తుకు వచ్చే పేర్లు గాంధీ, భగత్ సింగ్, తిలక్, ఝాన్సీ, చంద్ర బోస్, ఆజాద్ వంటి నార్త్ ఇండియన్స్ మాత్రమే. మనం చదువుకున్న పుస్తకాలలో కూడా వీరి గురించే ఉంది. బ్రిటీష్ వారిపై పోరాడి ప్రాణాలు వదిలిన మన తెలుగువాడు, మన్యం వీరుడు గురించి తెలిసింది చాలా తక్కువ. ఒకప్పుడు తెలుగు మీడియం పాఠ్య పుస్తకాలలో అడపాదడపా ఆయన గురించి ఉండేది. ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాక అది కూడా లేకుండా పోయింది. నవాబుల. అకృత్యాలపై పోరాడి అసువులు బాసిన కొమరం భీమ్ గురించి అయితే అసలు ఎవరికీ తెలియదు. మరి ఈ జనరేషన్ కి ఆ ఉద్యమ వీరుల గురించి తెలుసేలా ఆర్ ఆర్ ఆర్ చేయనుంది. ఇందుకైనా ఇంట్లో పిల్లలందరికి ఆర్ ఆర్ ఆర్ చూపించాలి.
సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తరవాత మళ్ళీ..
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో మల్టీస్టార్ లు తెరకెక్కేవి. టాప్ స్టార్స్ హోదాలో ఉండి ఎన్టీఆర్’ ఏ ఎన్ ఆర్ కలిసి అనేక సినిమాలు చేశారు. కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి హీరోలు వెండి తెరను పంచుకున్నారు. ఐతే ఆ తరువాత తరంలో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కలిసి మల్టీ స్టారర్ లు చేసింది లేదు. ఈ మధ్య కాలంలో వచ్చిన అతిపెద్ద మల్టీస్టారర్ వెంకీ, మహేష్ కలిసి చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.
ఐతే ఈ జనరేషన్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్. సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి కలిసి నటించగా మళ్ళీ మెగా ఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీ హీరో కలిసి నటించింది లేదు. ఆ అరుదైన కాంబినేషన్ ఇన్నేళ్లకు ఆర్ ఆర్ ఆర్ తో నెరవేరింది. అది కూడా స్టార్ హోదా కలిగిన ఎన్టీఆర్, చరణ్ నటించడం అనేది అరుదైన విషయం.
పీరియాడిక్ ఫిక్షన్ డ్రామా
సాధారణంగా చారిత్రక నేపథ్యంతో తెరకెక్కించే సినిమాలలో కాల్పనిక ఉండదు. అది కూడా ఉద్యమ వీరులు, దేశ భక్తుల జీవిత చరిత్ర ఆధారంగా సినిమాలు చేసేటప్పుడు చరిత్రను ఫాలో అవడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఏదో సినిమాటిక్ ఫీల్ కోసం, కమర్షియల్ అంశాల కోసం కొన్ని హంగులు జోడిస్తారు అంతే. కానీ ఆర్ ఆర్ ఆర్ అందుకు భిన్నంగా ఇద్దరు చారిత్రక వీరుల జీవిత కథల ఆధారంగా పూర్తిగా ఫిక్షన్ జోడించి రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. చరిత్రకు ఫిక్షన్ జోడించి తెరకెక్కుతున్న చిత్రం ఇండియాలోనే బహుశా ఆర్ ఆర్ ఆర్ కావచ్చు. అది కూడా ఓ ప్రత్యేకత మరియు ఆరుదైన అంశం.
భారీ బడ్జెట్
బాహుబలి తరువాత తెలుగు మూవీ మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఒక సినిమాలో సత్తా ఉంటే ప్రాంతీయ, భాషా భేధాలు విజయాన్ని అడ్డుకోలేవని నిరూపించింది. బాలీవుడ్ లో హైయెస్ట్ గ్రాస్సింగ్ మూవీగా తెలుగు సినిమా బాహుబలి ఉండడం వన్దర్ కాక ఇంకేమిటి. ఇక ఆ స్ఫూర్తితో భారీ బడ్జెట్ తో సాహో, సైరా వంటి చిత్రాలు తెరకెక్కాయి. ఆర్ ఆర్ ఆర్ కూడా దాదాపు 400 కోట్లకు పైగా బడ్జెట్ తో విజువల్ వండర్ గా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్. హిందీలో కూడా ఇంత బడ్జెట్ తో మూవీ తెరకెక్కలేదు. అక్కడ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బ్రహ్మాస్త్ర.
భారీ స్టార్ క్యాస్టింగ్
ఎన్టీఆర్, చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు ఉన్న ఆర్ ఆర్ ఆర్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఆయన వీరిద్దరికి గురువుగా చేస్తున్నారని సమాచారం. ఒక స్టార్ హీరో హోదాలో ఉన్న అజయ్ దేవ్ గణ్ ఓ ప్రాంతీయ భాషా సినిమాలో ఓ పాత్ర చేయడం విశేషం. ఇక ప్రస్తుతం బాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ టాలెంటెడ్ నటుడు సముద్ర ఖని, బ్రిటిష్ నటి ఒలీవియా మోరిస్, విలన్స్ గా అలిసన్ డూడి, రేవ్ స్టీవ్ సన్ వంటి భారీ క్యాస్ట్ తో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతుంది.
బాహుబలి విజయం గాలివాటం కాదని నిరూపించడానికి
చాల మంది బాలీవుడ్ ప్రముఖులు బాహుబలి విజయాన్ని జీర్ణించుకోలేక పోయారు. వారి సొంత గడ్డపై తెలుగువారి సినిమా జెండా ఎగురు వేయడం వారికి రుచించలేదు. అందుకే బాహుబలి సినిమాపై కొందరు విమర్శలు చేశారు. ఇక ఆ తరువాత వచ్చిన సాహో, సైరా వంటి చిత్రాలను నిరాదరణకు గురిచేసి, బాహుబలి విజయం గాలివాటం అని నిరూపించాలని చూశారు. సాహో వారి పప్పులు ఉడకనివ్వలేదు. దారుణమైన రేటింగ్స్ మధ్య మంచి విజయాన్ని నమోదు చేసింది. సైరా అయితే అక్కడ పూర్తిగా చేతులు ఎత్తేసింది. సరైన ప్రచారం లేకపోవడం ఒక మైనస్. ఆర్ ఆర్ ఆర్ మూవీ ద్వారా బాహుబలి విజయం గాలివాటం కాదని నిరూపించడానికి ఓ గొప్ప అవకాశం దక్కింది.
రాజమౌళి బ్రాండ్ ఇమేజ్
అన్నింటికీ మించి ఇది రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా. పోస్టర్ పై రాజమౌళి బ్రాండ్ లోగో చూసి వెళ్లి థియేటర్స్ లో కూర్చుంటే ఖచ్చితంగా అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. ఓటమి ఎరుగని తత్త్వం, నిరాశ పరచని నైజం ఆయనిది. ప్రేక్షకులు వంద శాతం ఊహించి వెళితే, రెండు వందల శాతం అనుభూతిని ఇవ్వడం రాజమౌళి ఆనవాయితి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన 11 చిత్రాలు అదే నిరూపించాయి. రాజమౌళి దర్శకుడన్న ఒక్క కారణం చాలు ఆర్ ఆర్ ఆర్ సినిమా చూడడానికి.