Game Changer: గేమ్ చేంజర్.. టైటిల్ కు కూడా భారీగానే పెట్టించాడు!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఇండియన్ జేమ్స్ కామెరూన్ గా పేరొందిన శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆర్.సి.15 వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికి బ‌డ్జెట్ `గేమ్ చేంజ‌ర్‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈరోజు రామ్ చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు (మార్చి 27) సందర్భంగా ఈ చిత్రానికి ‘ గేమ్ చేంజ‌ర్ ‘(Game Changer) టైటిల్ ను ఖరారు చేసినట్టు ఓ వీడియో రూపంలో తెలియజేశారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ టైటిల్ గ్లింప్స్ కు కూడా దిల్ రాజు తో గట్టిగానే ఖర్చు చేయించాడట దర్శకుడు శంకర్. ఈ ఒక్క గ్లింప్స్ కోసం ఏకంగా రూ.70 లక్షలు ఖర్చు అయ్యింది అనేది ఇన్ సైడ్ టాక్. నెల రోజుల నుండీ ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ కోసం పనిచేశాడట శంకర్.

మొత్తంగా 11 వెర్షన్లు రెడీ చేయించాడని తెలుస్తుంది. ఫైనల్ గా ఒకటి ఫైనల్ చేసి ఈరోజు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాకి కూడా శంకర్ గట్టిగానే పెట్టించాడు. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి నిర్మాత దిల్ రాజు రూ.200 కోట్ల బడ్జెట్ అంచనా వేసుకుంటే.. శంకర్ ఏకంగా ఇప్పటివరకు రూ.280 కోట్ల వరకు ఖర్చు చేయించినట్లు వినికిడి. ఇప్పటికీ ఈ చిత్రం షూటింగ్ 70 శాతం మాత్రమే పూర్తయ్యింది.

ఆగస్టు నాటికి ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరి అప్పటికి ఈ చిత్రం బడ్జెట్ ఎంత అవుతుందో. ఇక ఈ చిత్రంలో రాంచరణ్ డబుల్ రోల్ ప్లే చేస్తుండగా.. కియార అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. జయరామ్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus