చిన్న సినిమా.. పెద్దమనసు చాటుకున్న హీరో?

సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని దానికన్నా మంచి విజయాన్ని అందుకుంటే చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సినిమాలలో అధిక లాభాలు రావడంతో నిర్మాతలు దర్శకులకు టెక్నీషియన్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం మనం చూస్తున్నాము. ఈ విధంగా ఇండస్ట్రీలో గిఫ్ట్ లు ఇచ్చి పుచ్చుకోవడం ప్రస్తుతం ఫ్రెండ్ అవుతుంది. ఇకపోతే కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన హీరో రక్షిత్ శెట్టి తాజాగా 777 చార్లీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ఊహించిన దానికన్నా అత్యధిక లాభాలను తీసుకొచ్చింది. ఇక ఈ సినిమా ద్వారా మనుషులకు జంతువులకు ఉన్న ఎమోషన్ గురించి దర్శకుడు ఎంతో అద్భుతంగా చూపించారు. ఈ సినిమా చూస్తున్న ఎంతోమంది సెలబ్రెటీలు హీరో రక్షిత్ శెట్టిపై ప్రశంసలు కురిపించారు. ఇక కర్ణాటక ముఖ్యమంత్రి ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్న ఘటన కూడా చోటుచేసుకుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం స్వయంగా హీరో కి ఫోన్ చేసి అభినందనలు కురిపించారు. ఇకపోతే తాజాగా హీరో రక్షిత్ శెట్టి చేసిన ఓ పని తెలిసి అందరూ ఎంతో ఆశ్చర్య పోవడమే కాకుండా ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలలో వచ్చిన లాభాలను ఆయన ఏకంగా ఎన్జీవో సంస్థలకు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమాలలో వచ్చిన లాభాలను హీరో రక్షిత్ శెట్టి 10% సినిమాకి సంబంధించిన టెక్నీషియన్లకు అందించగా,మరో ఐదు శాతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్జీవో సంస్థలకు ప్రకటించాడు.

ఈ విధంగా ఎన్జీవో సంస్థలకు డబ్బు పంపించడమే కాకుండా మూగ జంతువులను ప్రేమించండి వాటిని హింసించవద్దు అంటూ చెప్పుకొచ్చారు.మూగజీవాల పట్ల నడుం బిగించినటువంటి ఎన్జీవో సంస్థల పట్ల తనకు అపారమైన గౌరవం ఉందని అందుకోసమే తాను ఐదు శాతం లాభాలను ఎన్జీవో సంస్థలకు ఇస్తున్నట్లు వెల్లడించారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Share.