చప్పగా సాగిన నామినేషన్స్..! ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ చాలా చప్పగా సాగాయి. ఫైర్ నామినేషన్స్ లో ఒకరి ఫోటని మంటల్లో వేసి రీజన్స్ చెప్పాలని చెప్పాడు బిగ్ బాస్. అంతేకాదు, ఈసారి హౌస్ మేట్స్ కి కూర్చునే ఏర్పాటు కూడా చేశాడు. అయినా కూడా హౌస్ మేట్స్ ఎవరూ కూడా వాలిడ్ పాయింట్స్ పెట్టలేదు. సాలిడ్ ఆర్గ్యూమెంట్స్ చేయలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే., సూర్యని ఇనయ నామినేట్ చేస్తే, ఇనయని సూర్య నామినేట్ చేశాడు. అంతేకాదు, వాళ్లిద్దరూ క్లోజ్ కాదని, వారిద్దరిమద్యలో ఏదీ లేదని ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేసింది ఇనయ.

ఇదే రీజన్ తో శ్రీహాన్ ని సైతం నామినేట్ చేసింది. దీంతో ఉత్తి పుణ్యానికి శ్రీహాస్ నామినేషన్స్ లోకి వచ్చాడు. ఇక లేడీస్ ఫైట్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. గీతు మెరీనాని నామినేట్ చేసి కొద్దిసేపు ఆర్గ్యూ చేసింది. ఆ తర్వాత మెరీనా మళ్లీ తిరిగి గీతుని నామినేట్ చేస్తూ రెచ్చిపోయింది. ఒకసారి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో చూసినట్లయితే.,

శ్రీసత్య – సూర్యని ఇంకా మెరీనాని నామినేట్ చేసింది.

ఆదిరెడ్డి – ఇనయ ఇంకా మెరీనా,
గీతు – మెరీనా , ఇనయ
బాలాదిత్య – శ్రీసత్య , గీతు
కీర్తి భట్ – రేవంత్ , శ్రీసత్య
సూర్య – ఇనయ , శ్రీసత్య
రోహిత్ – గీతు , శ్రీసత్య
ఇనయ – సూర్య, శ్రీహాన్
ఫైమా – శ్రీసత్య, మెరీనా
రాజ్ – ఇనయ , రేవంత్
మెరీనా – ఫైమా, రాజ్
రేవంత్ – కీర్తి , గీతు
వాసంతీ – ఆదిరెడ్డి , సూర్య,

శ్రీహాన్ – మెరీనా ఇంకా బాలాదిత్యలని నామినేట్ చేశారు.. ఈ నామినేషన్స్ లో పైమా మెరీనాతో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. అదికూడా చాలా చిన్నకారణం. వేరేవాళ్ల తరపున డిజాస్టర్ బ్యాడ్జ్ గురించి చెప్పింది ఫైమా. నీగేమ్ నువ్వు ఆడు అని, వేరేవాళ్ల గేమ్ నీకు అనవసరం అని చెప్పింది మెరీనా. నీ పాయింట్స్ ముందుపెట్టు అంటే నేను ముందు పెడతా, వెనకపెడతా అంటూ ఇద్దరూ కాసేపు రెచ్చిపోయారు. అలాగే,రేవంత్ కి కీర్తికి – రేవంత్ కి గీతుకి గట్టిగా పడింది. పెరుగు కోసం గీతు ఇంకా రేవంత్ ఇద్దరూ కాసేపు ఆర్గ్యూ చేసుకున్నారు.

ఇందులో రేవంత్ ఫుడ్ దొంగ అని స్టాంప్ వేసిింది గీతు. రేవంత్ తిరిగి కౌంటర్స్ వేస్తూ నువ్వు కూడా దొంగవే అని నిరూపించాడు. దీంతో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. నాముందు నువ్వు నథింగ్ అంటూ రెచ్చిపోయాడు రేవంత్. మొత్తానికి అక్కడక్కడా ఫైర్ లేని ఆర్గ్యూమెంట్స్ తో 8వ వారం నామినేషన్స్ చాలా చప్పగా సాగాయి. ఈసారి హౌస్ లో ఉన్న 14మంది హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. దీన్ని బట్టీ చూస్తే ఈవారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి వీళ్లలో ఎవరు ఇంటికి వెళ్లిపోబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus