Bigg Boss Telugu 6: ఈవారం ఎలిమినేషన్ లో భయంకరమైన ట్విస్ట్ ఇదే..! కాస్కోండి బిగ్ బాస్ ఫ్యాన్స్..!

బిగ్ బాస్ లవర్స్ అందరూ తమ ఫేవరెంట్ కంటెస్టెంట్స్ కి ఓటు వేసి గెలిపించాలనే అనుకుంటారు. కానీ, ఒక్కోసారి తమ ఫేవరెట్స్ హౌస్ నుంచీ వెళ్లిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మొదటి రెండు వారాల్లోనే తమ ఫేవరెట్స్ అనుకున్న వాళ్లు వెళ్లిపోతే చాలా బాధగా ఉంటుంది. అందుకే, ఫస్ట్ టైమ్ బిగ్ బాస్ తెలుగు సీజన్స్ చరిత్రలోనే మొదటివారం ఎలిమినేషన్ తీసేశారు. అయితే, మరి రెండోవారం ఎలిమినేషన్ సంగతేంటి అనేది ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం నామినేషన్స్ లో రెండోవారం ఎనిమిది మంది ఉన్నారు. వీళ్లలో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు , మెరీనా రోహిత్ జంట ఉన్నారు. మరి వీళ్లలో ఈసారి ఎవరు ఇంటికి వెళ్లిపోబోతున్నారు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రెండోవారం బిగ్ బాస్ ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ పెడతారు అనే ప్రిడిక్షన్స్ మొదలయ్యాయి. ఎందుకంటే, మొదటి వారం లేదు కాబట్టి రెండోవారం ఇద్దర్ని పంపించచ్చు అంటున్నారు. ఒకవేళ ఇద్దరూ వెళ్లిపోవాల్సి వస్తే అసలు డేంజర్ జోన్ లో ఎవరున్నారు అనేది ఆసక్తికరంగా మరింది.

అన్ అఫీషియల్ పోలింగ్ సైట్స్ ని బట్టీ చూస్తే, రేవంత్, ఫైమా, ఆదిరెడ్డి, రోహిత్ – మెరీనా కపుల్ సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అందరికంటే టాప్ లో రేవంత్ ఉంటే, తర్వాత ఫైమా , రోహిత్ – మెరీనా కపుల్ కొనసాగుతున్నారు. అయితే, వీరికి అందరికంటే కూడా ఎక్కువ ఓటింగ్ అనేది జరుగుతోంది. ఇక మిగిలిన ఐదుగురు డేంజర్ జోన్ లోనే ఉన్నారు. వీళ్లలో బిగ్ బాస్ రివ్యూవర్స్ ఆదిరెడ్డి, గీతురాయల్ కూడా ఉన్నారు. అలాగే రాజేశేఖర్, షానీ, అభినయశ్రీలు ఓటింగ్ లో వెనకబడిపోయారు.

మరి వీళ్లలో ఏ ఇద్దరైనా వెళ్లిపోయే అవకాశం ఉంది. కానీ, డబుల్ ఎలిమినేషన్ లేకపోతే మాత్రం ఎలిమినేషన్ అనేది ఇంట్రస్టింగ్ గా మారబోతోంది. ఒకవేళ బిగ్ బాస్ భయంకరమైన డబుల్ ఎలిమినేషన్ ట్విస్ట్ ఇస్తే మాత్రం ఏదైనా జరగచ్చు. ఓటింగ్ అనేది ఎలా జరుగుతోందంటే., ప్రస్తుతం ఓటింగ్ అనేది కొనసాగుతూనే ఉంది. శుక్రవారం రాత్రి వరకూ ఓటింగ్ ని పరిగణలోకి తీస్కుంటారు. హౌస్ లో సిసింద్రీ టాస్క్ లో పెర్ఫామన్స్ ని బట్టీ కూడా ఓటింగ్ అనేది పార్టిసిపెంట్స్ కి పడే అవకాశం ఉంది.

దీన్ని బట్టీ చూస్తే గీతు ఈ టాస్క్ లో బాగా పెర్ఫామ్ చేసింది కాబట్టి సేఫ్ అవ్వొచ్చు. ఇక రివ్యూవర్ ఆదిరెడ్డి కూడా మొదటి రెండురోజులు ఓటింగ్ ని ఓ మోస్తరుగా సంపాదిస్తునే ఉన్నాడు. ఇక రాజశేఖర్, షానీ, ఇంకా అభినయశ్రీ ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ అనేది ఉండబోతోంది. మరి ఈసారి సీజన్ లో ఫస్ట్ టైమ్ ఒక అబ్బాయిని మొదటి ఎలిమినేషన్ గా ఇంటికి పంపిస్తారా ? లేదా ఆనవాయితీగా వస్తున్న ఎలిమినేషన్ ఆచారం ప్రకారం ఒక అమ్మాయే ఫస్ట్ ఎలిమినేట్ అవుతుందా అనేది చూడాలి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus