Bigg Boss Telugu 6: ఈసారి నామినేషన్స్ లో బిగ్ బాస్ టీమ్ మర్చిపోయింది ఇదేనా ?

బిగ్ బాస్ హౌస్ లో అప్పుడే 5 వారాలు గడిపేశారు హౌస్ మేట్స్ అందరూ. అయితే, 5వ వారం నామినేషన్స్ కొద్దిగా భిన్నంగ్ జరిగాయి. ఇద్దరు హౌస్ మేట్స్ జోడిగా వచ్చి ఒకరు నామినేషన్ లోకి రావాలి, ఒకరు సేఫ్ అవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. దీంతో ఏ ఇద్దరు హౌస్ మేట్స్ మద్యలో క్లాషెష్, ప్రేమా అనుబంధాలు ఉన్నాయో వారిని సెలక్ట్ చేసి చెప్పాడు బిగ్ బాస్. ముందుగా రోహిత్ – మెరీనా ఇద్దరినీ కపుల్ గా కాకుండా విడివిడిగా పార్టిసిపెంట్స్ గా ఉండమని చెప్పాడు. వీరిద్దరిని కలిపి నామినేషన్స్ లోకి తీస్కుని వచ్చాడు.

దీంతో మెరీనా రోహిత్ కోసం త్యాగం చేసి నామినేట్ అయ్యింది. ఆ తర్వాత ఇనయ సుల్తానా, శ్రీహాన్ ఇద్దరి మద్యలో ఆర్గ్యూమెంట్ జరిగింది. శ్రీహాన్ తో ఛాలెంజ్ చేసిన ఇనయ నామినేట్ అయ్యింది. సుదీప – వాసంతీ కృష్ణన్ ఇద్దరూ కాసేపు వాదించుకున్న తర్వాత సుదీప సేఫ్ అయి, వాసంతీ నామినేట్ అయ్యింది. ఆ తర్వాత శ్రీసత్య- అర్జున్ లలో అర్జున్ నామినేట్ అయ్యాడు. ఆదిరెడ్డి – రేవంత్ లలో ఆదిరెడ్డి నామినేట్ అయ్యాడు. ఫైమా – సూర్య ఇద్దరిలో ఫైమా సూర్యకోసం నామినేట్ అయ్యింది.

గీతు – చంటి విషయంలో చంటి ఈసారి నామినేషన్ ని తీస్కున్నాడు. బాలాదిత్య, రాజ్ వీరిద్దరిలో బాలాదిత్య నామినేట్ అయ్యాడు. మొత్తం మీద ఈసారి నామినేషన్స్ లోకి 8మంది వచ్చారు. అయితే, ఈ సీజన్ లో బిగ్ బాస్ టీమ్ నామినేషన్స్ లో ట్విస్ట్ ఇవ్వట్లేదనే అనిపిస్తోంది. నామినేషన్స్ అప్పుడు కెప్టెన్ కి ఒక పవర్ ఇచ్చి ఒకర్ని సేవ్ చేయడం, లేదా ఒకర్ని నామినేట్ చేయడం చేస్తుంటారు. ఈసీజన్ లో మాత్రం ఫస్ట్ వీక్ భిన్నంగా నామినేషన్ ప్రక్రియని చేశారు. అప్పుడు కెప్టెన్ ఎవరూ లేరు కాబట్టి, క్లాస్ టీమ్ ఏకాభిప్రాయంతో ఒకరిని సేవ్ చేయమని అడిగారు.

అప్పటి నుంచీ ఇప్పటి వరకూ అసలు నామినేషన్స్ లో ట్విస్ట్ లేదు. అంతేకాదు, చాలా చప్పగా హౌస్ మేట్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లుగానే అనిపిస్తున్నప్పుడు బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు అందరూ. నిజానికి బిగ్ బాస్ నామినేషన్స్ ని ఓపెన్ గానే పెడతాడు. కానీ, చివర్లో కెప్టెన్ కి పవర్ ఇవ్వడం , లేదా స్వాప్ చేయడం చేస్తుంటాడు. కానీ, ఈసారి మాత్రం అలా చేయలేదు. ప్రేక్షకులకి బిగ్ బాస్ షో ఐదు వారాలు గడుస్తున్నా కూడా షో మీద ఎలాంటి ఆసక్తి కలగడం లేదు.

బిగ్ బాస్ ప్రతి సీజన్ లో నామినేషన్స్ అప్పుడు ఏదో ఒక ట్విస్ట్ అనేది కంపల్సరీగా ఉండేది. అయితే, ఐదోవారం జంటలుగా నామినేట్ అవుతున్నప్పుడు 8మంది నామినేషన్స్ లోకి వస్తారని బాగా తెలుసు. ఇక్కడే కెప్టెన్ కీర్తికి ఏదైనా పవర్ ఇస్తారని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ, అలాంటిదేమీ లేకుండా బిగ్ బాస్ నామినేషన్స్ ని ముగించేశాడు. మరి ఈ సీజన్ ఇలాగే నామినేషన్స్ సాగితే మాత్రం రేటింగ్ పై దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా ట్విస్ట్ ఇస్తూ దాన్ని ప్రోమోలో చూపిస్తే ఆడియన్స్ బాగా ఎట్రాక్ట్ అవుతారు. మరి రానున్న వారాల్లో బిగ్ బాస్ టీమ్ అనేది చూడాలి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus