ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమాకు రోజురోజుకు కలెక్షన్లు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే ఎ సర్టిఫికెట్ వల్ల 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లను ఈ సినిమాకు అనుమతించడం లేదు. తాజాగా ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ సినీ పోలీస్ థియేటర్ లో సలార్ సినిమాను చూడటానికి తన పిల్లలతో పాటు కలిసి వచ్చింది. అయితే థియేటర్ యాజమాన్యం పిల్లలను థియేటర్ లోకి అనుమతించలేదు.
ఆ మహిళ థియేటర్ యాజమాన్యం పట్ల అసహనం వ్యక్తం చేయడంతో పాటు థియేటర్ నిర్వహకులతో గొడవ పడగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సలార్ మూవీకి ఎ సర్టిఫికెట్ రాకుండా ఉండి ఉంటే ఈ సినిమాకు మరింత మెరుగ్గా కలెక్షన్లు వచ్చేవి. ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నా ఆ సీన్లు కథానుసారం వచ్చే సీన్లు అనే సంగతి తెలిసిందే.
ఏపీలో ఈ సినిమాకు మరింత ఎక్కువ మొత్తం టికెట్ రేట్ల పెంపు అమలు చేసి ఉంటే ఈ మూవీకి మరింత ప్లస్ అయ్యేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ మూవీకి మరో రెండు వారాల పాటు కలెక్షన్ల విషయంలో తిరుగుండదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.
కన్నడ వెర్షన్ మినహా సలార్ (Salaar) అన్ని వెర్షన్లకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ప్రభాస్ ఇమేజ్ ను సలార్ మార్చేసిందని ఊరమాస్ సినిమాలతో సైతం ఇండస్ట్రీ హిట్లు సాధించడం ప్రభాస్ కే సాధ్యమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సాధించిన ఎన్నో రికార్డులను సలార్ బ్రేక్ చేయడం ఖాయమని తేలిపోయింది. నైజాంలో సలార్ సినిమా కలెక్షన్ల విషయంలో సృష్టిస్తున్న సంచలనాలు అన్నీఇన్నీ కావు.