కొన్నిసార్లు మన లైఫ్ లో అనుకోకుండా కొన్నికొన్ని రేర్ మూమెంట్స్ చాలా స్పెషల్ గా నిలిచిపోతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మన ఫ్రెండ్ లైఫ్ లో జరిగినట్లే మన లైఫ్ లో జరిగితే అది కూడా ఒకే సంవత్సరం జరిగితే .. అది ఇంకా ఇంకా స్పెషల్ . అలాంటి ఓ రేర్ అండ్ అన్ ఫర్గెటబుల్ మూమెంట్స్ అల్లు అర్జున్ –ఎన్టీఆర్ లైఫ్ లో ఒకే సంవత్సరంలో జరగడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది .
ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న తారక్ అల్లు అర్జున్ ల మధ్య ఉన్న రిలేషన్షిప్ చాలా చాలా ప్రత్యేకం. కొన్ని సందర్భాలలో బ్రదర్స్ గా .. కొన్ని సందర్భాలలో మంచి ఫ్రెండ్స్ గా ..కొన్ని సందర్భాలలో ఉపయోగపడే సిటిజన్స్ గా .. మరికొన్ని సందర్భాలలో బావ బావమరుదులుగా .. ఇలా మంచి బాండింగ్ తో ముందుకు వెళ్తున్నారు . కాగా ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ సంపాదించుకొని స్టార్ హీరోలుగా రాజ్యమేలేస్తున్నారు.
ఈ హీరోల లైఫ్లో మర్చిపోలేని సంత్సరం 2011. అటు బన్నీకు ఇటు తారక్ కి పెళ్లి జరిగిన సంవత్సరం. 6 మార్చి 2011 స్నేహా లతా రెడ్డి ను పెళ్లి చేసుకున్నాడు అల్లు అర్జున్. వీళ్లది ప్రేమ వివాహం. మొదట ప్రేమించుకున్న ఈ జంట తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే అదే సంవత్సరం మే 5 (Jr NTR) ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లది పెద్దలు కుదిర్చిన వివాహం . ఇద్దరు కూడా తమ వైవాహిక జీవితంలో హ్యాపీగా ముందుకెళ్ళిపోతున్నారు. వీరికి అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. ఇలా మోస్ట్ స్పెషల్ హీరోస్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – బన్నీ కెరియర్ లో 2011వ సంవత్సరం మోస్ట్ అన్ ఫర్గెటబుల్ ఇయర్ గా మిగిలిపోయింది.