Crazy Combination: క్రేజీ కాంబినేషన్ సినిమా ఆఫీస్ ఖాళీ అయిపోయిందట.!
- August 28, 2024 / 10:29 AM ISTByFilmy Focus
ఇండస్ట్రీలో చాలా హడావుడిగా సినిమా ఆఫీసులను ప్రారంభించడం, లక్షలు లేదా కోట్ల రూపాయలు ప్రీప్రొడక్షన్ పేరిట ఖర్చు చేయడం, ఆ తర్వాత వర్కవుట్ అవ్వట్లేదు అని మూసేయడం అనేది సర్వసాధారణంగా జరిగే తతంగం. ఇప్పటివరకు ఇలా ఆఫీసులు పెట్టి ఆగిపోయిన సినిమాల సంఖ్య లెక్క వేయలేనంత పెద్దది. కేవలం ఇలా ఆగిపోయిన సినిమాల ఆఫీసులకు వచ్చిన రెంట్లతో రెండు శంకర్ (Shankar) రేంజ్ సినిమాలు తీయొచ్చు అని ఫిలిం నగర్ లో చెప్పుకొంటారు.
Crazy Combination

ఇటీవల ఓ భారీ సినిమా విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. పూజా కార్యక్రమాలు జరగకపోయినా.. ఓ సీనియర్ హీరో & మాస్ డైరెక్టర్ కాంబినేషన్ (Crazy Combination) సినిమా కోసం ఆఫీస్ తీసింది ప్రొడక్షన్ హౌజ్. ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలెట్టింది. స్టోరీ డిస్కషన్స్ అంటూ నెలల తరబడి సదరు ఆఫీస్ మీద భారీగా ఖర్చు చేసారు. ఇవాళ ఉదయం ఓ రైటర్ సదరు ఆఫీసుకు వెళ్లగా.. తాళలు వేసి కనిపించిందట.

ఆఫీసులో ఎవరు లేరేమో అనుకున్న తరుణంలో, ఓనర్ వచ్చి ఖాళీ చేసేశారమ్మా అని షాక్ ఇచ్చాడట. వెంటనే టీమ్ మెంబర్ కి ఫోన్ చేసిన్ కనుక్కోగా.. “అవును భయ్యా ఆఫీస్ మూసేశారు, సినిమా కూడా ఆగిపోయింది” అని బాంబ్ పేల్చాడట. ఈపాటికే సదరు కాంబినేషన్ (Crazy Combination) ఏమిటి? అనే విషయమై మీకో క్లారిటీ వచ్చుంటుంది కదూ. సో, ఈ విషయమై అఫీషియల్ గా ఏమైనా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారా లేక ఎప్పట్లానే సైలెంట్ గా ఉంటారా అనేది చూడాలి.

ఇకపోతే.. సదరు దర్శకుడు మాత్రం ఈ విషయమై ఏమాత్రం చితించకుండా, హ్యాపీగా తన నెక్స్ట్ ప్రొజెక్ట్ కోసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాడట. సదరు సినిమాకి ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు, ఎవరు నిర్మిస్తారు? ఎప్పడు సెట్స్ మీదకు వెళ్తుంది అనే విషయంలో క్లారిటీ రావడానికి మాత్రం చాలా టైమ్ పట్టేలా ఉంది.
















