నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) దర్శకత్వంలో ‘అంటే సుందరానికీ!’ వంటి క్లాసిక్ మూవీ తర్వాత రూపొందిన చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). ఇది ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ. ‘డీవీవీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై డీవీవీ దానయ్య (D. V. V. Danayya) ఈ చిత్రాన్ని నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందించారు. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు వంటివి బయటకు వచ్చాయి. అన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా ట్రైలర్లో ‘పోతారు మొత్తం పోతారు’ అనే డైలాగ్.. సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చింది.
చిత్ర బృందం గ్యాప్ లేకుండా సినిమాను ప్రమోట్ చేస్తుంది. 3 రోజుల క్రితమే సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా కంప్లీట్ అయ్యాయి. సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. సినిమా సక్సెస్ పై టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మరోపక్క సినిమాని ఇండస్ట్రీలో కొంతమంది వీక్షించడం జరిగింది. సినిమా వీక్షించిన తర్వాత వాళ్ళు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వారి టాక్ ప్రకారం.. ‘సరిపోదా శనివారం’ సినిమాలో హీరో నాని ఎల్.ఐ.సి ఏజెంట్ సూర్యగా కనిపిస్తాడట.
చిన్నప్పటి నుండి ఇతనికి కోపం ఎక్కువ.. అందువల్ల ఇతని కోపాన్ని ఆదివారం నుండి శుక్రవారం వరకు ఆపుకోవాలని.. తల్లి చెప్పడంతో.. దానిని అలవాటు చేసుకుంటాడట. శనివారం రోజు మాత్రం శివతాండవం ఆడేస్తాడని తెలుస్తుంది. అయితే మిగిలిన రోజుల్లో ఇతనికి విలన్ ఎస్.జె.సూర్య (SJ Suryah) వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి.? ఇందులో చారుశీల(ప్రియాంక అరుళ్ మోహన్) (Priyanka Mohan) పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ (Saripodhaa Sanivaaram First Review) బాగుంటుందట.
సెకండాఫ్ లో కొంచెం వయొలెన్స్ ఎక్కువగా ఉందనే కంప్లైంట్ ఉంది. అయితే క్లైమాక్స్ మళ్ళీ సినిమా గ్రాఫ్ ను పెంచింది అని చెబుతున్నారు. అందువల్ల నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ కలగదట. నాని, ఎస్.జె.సూర్య పోటీపడి నటించారట. ప్రియాంక కూడా అందంగా కనిపిస్తూనే.. మంచి పెర్ఫార్మన్స్ ఉన్న రోల్లో నటించి మెప్పించింది అని తెలుస్తుంది. రిలీజ్ రోజున ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.