సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ నేపథ్యంలో హాలీవుడ్‌లో మొదలైన మీటూ ఉద్యమం ఇండియాలోని పలు చిత్ర పరిశ్రమల్లో కూడా ఎంతటి సంచలన సృష్టించిందో, ప్రకంపనలు రేపిందో తెలిసిందే.. హాలీవుడ్‌లో కొందరు శిక్ష అనుభవిస్తుంటే.. మన దగ్గర పలువురు ఆరోపణలు ఎదర్కొని, విచారణకు హాజరయ్యారు.. అయినా ఇంకా ఈ అరాచకాలు ఆగట్లేదు.. తాజాగా మరో ఉదంతం చోటు చేసుకుంది.. దీంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది.. వివరాల్లోకి వెళ్తే.. ఓ పాపులర్ కమెడియన్, డైరెెక్టర్ ఖయాలీ సహారాన్ తాగిన మత్తులో ఓ యువతిపై అత్యాచారం చేశాడు..
సదరు యువతి ఫిర్యాదుతో అతడిపైన కేసు నమోదు చేశారు పోలీసులు.. రాజస్థాన్‌లోని హనుమాన్ గఢ్ ప్రముఖ టీవీ సీరియల్ కమెడియన్ అయిన ఖయాలీ సహారాన్ తన మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ ఓ రాజస్థానీ యువతి జైపూర్‌లోని మానస సరోవర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.. ఆమె తెలిపిన వివరాల ప్రకారం ఖయాలీ సహారాన్ మీద అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు..
వివరాల్లోకి వెళ్తే.. సినిమా పరిశ్రమలో ఏదైనా ఉద్యోగం కావాలంటూ ఓ ఇద్దరు యువతులు కమెడియన్ ఖయాలీ సహారాన్ సహాయం కోరారు.. తనకు మంచి కాంటాక్ట్స్ ఉండంతో ఎలాగైనా పని కల్పిస్తాడనేది వారి ఆశ.. ఖయాలీ కూడా తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు.. ఈ విషయం గురించి మాట్లాడదామంటూ నెల క్రితం ఓ హోటల్‌లో రెండు రూమ్స్ బుక్ చేశాడు.. యువతులిద్దరికీ ఓ రూమ్ ఇచ్చి, తను మరో రూమ్ తీసుకున్నాడు..
ఆ సమయంలో ఖయాలీ మద్యం సేవిస్తూ.. తాగవలసిందిగా ఆ యువతులను బలవంతం చేశాడు.. దీంతో భయాందోళనకు గురైన ఓ యువతి అక్కడినుండి వెళ్లిపోయింది.. ఇదే అదునుగా భావించిన ఖయాలీ మరో యువతిపై అత్యాచారం చేశాడు.. దీంతో ఆ యువతి అతని మీద ఫిర్యాదు చేసింది.. కాగా బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఖయాలీ సహారాన్ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని సమాచారం..