‘స్నేహం కోసం’ సినిమా చూశారా? ఇద్దరు చిరంజీవిలు ఈ సినిమాలో భలే సందడి చేస్తారు. అయితే ఈ సినిమాలో కామెడీ కూడా అంతే అదిరిపోతుంది. సినిమా ఎంట్రన్స్ సీనే హైలైట్ అని చెప్పొచ్చు. ఓ సంచి నిండా డబ్బులు వేసుకొని (ఉన్నాయని ముందు చెప్పరనుకోండి) ఓ కారు షో రూమ్‌కి వెళ్తారు. అక్కడ కారు చూసి, దాని రేటు అడుగుతారు. ఆ సేల్స్ మ్యానేమో… కొనే మొహమేనా మీది అంటూ జోకేసి నవ్వేసుకుంటాడు. అయితే సంచి దులిపి డబ్బులు చూపించి ఆ సేల్స్‌మ్యాన్ నోరు మూయించి, కారు కొంటారు చిరంజీవి, విజయ్ కుమార్.
ఆ సీన్ చూసినప్పుడు మీరెంత నవ్వుకున్నారో తెలియదు కానీ… అలాంటి సీన్ ఇప్పుడు మళ్లీ జరిగింది అంటే అంతే ఆశ్చర్యపోతారు. అయితే జరిగింది మన దగ్గర కాదు. కర్ణాటకలో. అక్కడ ఓ కారు షోరూమ్‌కి ఒక రైతు వెళ్లాడు. అందరిలాగే కారు ధర ఎంత అని అడిగాడు. అయితే ఆ వ్యక్తిని తక్కువ చేస్తూ… సిబ్బంది అవమానించేలా మాట్లాడారు. కారు ధర కావాలా? ఇది పావలానో అర్ధ రూపాయో కాదు అంటూ అవహేళనగా మాట్లాడారు. అయితే ఆ రైతు ఇచ్చిన రిటార్ట్‌కి షాపు సేల్స్ మ్యాన్‌కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఆ తర్వాత రైతు చేసిన పనికి మైండ్ బ్లాంక్ డబుల్ అయ్యింది.
ఆ మొత్తం సీన్ మీకు కళ్లకు కట్టినట్లు కనిపించాలి అంటే… ‘స్నేహం కోసం’ సినిమాలోని చిరంజీవి ఎంట్రన్స్ సీన్ చూస్తే సరి. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేకుండా బాగా అర్థమైపోతుంది. కాసేపు ఆ విషయం పక్కనపెడితే… ఆ రైతు ఏం చేశాడో చూద్దాం. కర్ణాటకలోని తుముకూరులో ఉన్న మహీంద్రా షోరూమ్‌లో ఈ సీన్ జరిగింది. మహీంద్రా బొలెరో పికప్ వెహికల్ కొనడానికి ఓ రైతు షోరూమ్‌కి వెళ్లాడు. అతని పేరు కెంపె గౌడ. తన స్నేహితులతో కలిసి వాహనం కొనడానికి వెల్లగా… అక్కడి సేల్స్ మ్యాన్ ఈ వెహికల్ రేటు మీరనుకున్నట్లు 10 రూపాయలు కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడట.
ఈ క్రమంలో మాటా మాటా పెరగడంతో అక్కడ జరిగిన విషయాన్ని ఒకరు రికార్డు చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్‌గా మారింది. రైతును ఉద్దేశిస్తూ సేల్స్ మ్యాన్ అవమానకరంగా మాట్లాడం, వస్త్రధారణను అవమానించడం ఆ వీడియోలో ఉన్నాయి. ఆ తర్వాత రైతు ఇచ్చిన రిటార్ట్ కూడా ఆ వీడియోలో చూడొచ్చు. ఇంతకీ రైతు ఏం చేశాడనేగా… ఆ సినిమా చిరంజీవి, విజయ్ కుమార్ మూట తీసుకొచ్చి ఒంపిస్తే లక్షల కరెన్సీ కనిపించింది. అక్కడైతే రైతుల ఓ అర్ధ గంట టైమ్ తీసుకొని బయటకు వెళ్లి పది లక్షల రూపాయల క్యాష్ తెచ్చాడు.
దీంతో షోరూమ్ సిబ్బంది అవాక్కయ్యారట. డబ్బులు తీసుకొని కారు ఇమ్మంటే… మూడు రోజుల్లో కారు డెలివరీ ఇస్తామన్నారట. అయితే అక్కడి నుండి ఆ రైతు పోలీసు స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడట. దీంతో షోరూమ్ సేల్స్ మ్యాన్, ఉద్యోగులు వచ్చి రైతు కెంపె గౌడకి క్షమాపణలు చెప్పి వివాదానికి ముగింపు పలికారట.
Mahindra Car showroom salesman taunted a farmer aftr seeing his attire when he visited showroom to buy Bolero Pik-up. Farmer Kempegowda alleged field officer of showroom made fun of farmer & his attire, told him tat car is not worth 10 rupees for him to buy. @anandmahindrapic.twitter.com/9fXbc5naY7