AR Rahman: నెటిజన్ ఘాటు కామెంట్ కి ఏఆర్ రెహ్మాన్ రిప్లై!
- January 27, 2023 / 01:53 PM ISTByFilmy Focus
దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఫిక్షనల్ పీరియాడిక్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటుంది. ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ‘నాటు నాటు’ ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లడంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్లడంపై రెహ్మాన్ సంతోషం వ్యక్తం చేశారు.
కచ్చితంగా ఈ పాటకు ఆస్కార్ వస్తుందని ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంలో ఓ నెటిజన్ వేసిన కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ‘మా తమిళులు తెలుగువారి మీద ప్రేమను చూపిస్తారు. వారికి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు. కానీ ఆంధ్ర వాళ్లకి మాత్రం తమిళులంటే ద్వేషం’ అంటూ కామెంట్ చేశారు. అది చూసిన రెహ్మాన్ అలా వదిలేయకుండా.. ‘మనమంతా ఓ కుటుంబం. మన మధ్య మనస్పర్థలు రావొచ్చు, ఉండొచ్చు.

కానీ ఒకరికొకరం సాయంగా ఉండాలి. అండగా నిలబడాలి’ అని బదులిచ్చారు. అది చూసిన సదరు నెటిజన్ సైలెంట్ అయిపోయారు. రెహ్మాన్ ట్వీట్ ను సమర్ధిస్తూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో ఇలాంటి కామెంట్స్ ను పట్టించుకోకుందంటూ సలహాలు ఇస్తున్నారు.
We are all one family we could have misunderstandings …but we should stand for each other https://t.co/GLMYPHahcD
— A.R.Rahman (@arrahman) January 26, 2023
హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!












