Nagarjuna: ఈ రేర్ రికార్డ్ నాగ్ కు మాత్రమే సొంతమట!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగార్జునకు ప్రేక్షకుల్లో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. ఎలాంటి కథలో నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే హీరోలలో నాగార్జున ఒకరు కావడం గమనార్హం. అక్కినేని నాగార్జున ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ది ఘోస్ట్, బ్రహ్మాస్త్ర సినిమాలలో నాగార్జున నటిస్తుండగా ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే నాగ్ ఖాతాలో ఉన్న ఒక అరుదైన రికార్డ్ గురించి నెట్టింట అభిమానుల మధ్య జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

ఒక స్టార్ హీరోయిన్ తండ్రీ కొడుకులకు జోడీగా నటించడం అరుదుగా జరుగుతుంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా తండ్రీ కొడుకులకు హీరోయిన్లుగా నటించిన వాళ్లు చాలామందే ఉన్నారు. శ్రీదేవి, రాధ ఏఎన్నార్ కు జోడీగా నటించడంతో పాటు నాగార్జున సరసన కూడా నటించడం గమనార్హం. అయితే తండ్రి సరసన నటించిన హీరోయిన్లతో పాటు కొడుకు సరసన నటించిన హీరోయిన్లు సైతం నాగార్జునకు జోడీలుగా నటించడం గమనార్హం. లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ జాబితాలో ఉన్నారు.

చైతన్యతో సినిమాల్లో రొమాన్స్ చేసిన లావణ్య, రకుల్ నాగార్జున సినిమాలలో హీరోయిన్లుగా నటించారు. ఈ రేర్ రికార్డ్ నాగ్ కు మాత్రమే సొంతమైందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగార్జున క్రియేట్ చేసిన ఈ రికార్డును మరే స్టార్ హీరో అయినా బ్రేక్ చేస్తారేమో చూడాల్సి ఉంది. ఒక్కో సినిమాకు నాగార్జున 6 నుంచి 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు. నాగార్జున భవిష్యత్తు ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. త్వరలో నాగార్జున కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus