బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas) .. అగ్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) తనయుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు. దర్శకుడు వి.వి.వినాయక్ (V. V. Vinayak) పుణ్యమాని ‘అల్లుడు శీను’ (Alludu Seenu) సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడింది. డెబ్యూ హీరోల సినిమాల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు కొట్టింది. దీని తర్వాత శ్రీనివాస్ .. 8 సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే ఒక్కటి కూడా ‘అల్లుడు శీను’ ని మించి కలెక్ట్ చేసింది లేదు. నామ మాత్రంగా ‘రాక్షసుడు’ (Rakshasudu) సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది అంతే..!
అయితే శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మాత్రం ‘నా కొడుకు ఇండియాలో సూపర్ స్టార్’ అంటూ ఎలివేషన్ ఇస్తూ.. డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. కెరీర్ ప్రారంభంలో పరోక్షంగా శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి.. అప్పుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ అప్పులు తీర్చడం కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి ఉన్న మినిమమ్ మార్కెట్ ను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ ‘ఛత్రపతి’ సెట్స్ లో ఉండగానే ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu) ‘భైరవం’ (Bhairavam) వంటి సినిమాలకి అడ్వాన్స్ తీసుకున్నాడు బెల్లంకొండ.
అవి కంప్లీట్ చేయకుండానే ‘హైందవం’ అనే సినిమాను కూడా సగం కంప్లీట్ చేశారు. అది కూడా మధ్యలో వదిలేసి మరో రెండు సినిమాలకు సైన్ చేశాడు బెల్లంకొండ. ఒక్కో సినిమాకి అతను రూ.10 కోట్ల చొప్పున ఛార్జ్ చేస్తూ వస్తున్నాడు. ఇలా ఏ సినిమాని కంప్లీట్ చేయకుండా.. వరుస సినిమాలకు సైన్ చేయడం వెనుక ఒక కథ కూడా ఉంది. వాస్తవానికి వీటిలో ఏ సినిమాకు బజ్ లేదు.
కానీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు అనిపించుకోవడానికి బెల్లంకొండ ఈ రకంగా వరుస సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నాడు అనేది ఇన్సైడ్ టాక్.బాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లు ఇదే పద్ధతిని అనుసరిస్తూ ఉంటారట. దాని వల్ల కొత్త నిర్మాతలు లేదా అనుభవం లేని నిర్మాతలు.. టెంప్ట్ అయ్యి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసుకుంటూ ఉంటారన్న మాట. బెల్లంకొండ బాలీవుడ్ వెళ్లి ఇదే నేర్చుకుని ఉంటాడు అని ఇప్పుడు అంతా అనుకుంటున్నారు.