తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రతికి ఉన్నంత కాలంస్వర్గీయ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని మన తెలుగు వాళ్ళు మర్చిపోలేరు అనడంలోఎలాంటి అతిశయోక్తి. ఆయన బౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన పాటల రూపం లోఎప్పటికీ చిరంజీవి లాగ మన మధ్యనే ఉంటాడు. తెలుగు , హిందీ , తమిళం , మలయాళం , కన్నడ ఇలా ఆయన పాడని బాషా అంటూమిగలలేదు. హీరోలకు తగ్గట్టుగా మిమిక్రీ చేస్తూ పాటలుపాడడం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్పెషాలిటీ.
అందుకే అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడుఅని గర్వంగా చెప్పగలరు తెలుగు ప్రేక్షకులు. అలాంటి టాలెంట్ ఉన్న సింగర్ ని చూస్తే ఆయనతోటి సింగర్స్ కి అసూయ వెయ్యకుండా ఉండదు. అలా అని బాలసుబ్రహమణ్యం గారికి ఎవరితోనూశత్రుత్వం కూడా ఇండస్ట్రీ లో లేదు. చాలా స్పోర్టివ్ గా ఉండే మనిషి ఆయన.ఇది ఇలా ఉండగా ఒకానొక సమయం లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గొంతు చెడిపోయింది.ఆయనకీ మేజర్ సర్జరీ చెయ్యాలి లేకపోతే ఇక మీదట ఆయన పాడడం కష్టం అని డాక్టర్లుఅన్నారట.
ఆ సమయం లో ఎస్పీ బాలసుబ్రమణ్యం (Sp Balasubrahmanyam) ఇలాంటివన్నీ తరచు చెప్తూనే ఉంటారు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం అని, కొన్ని పాటలు ఒప్పుకొని చేసాడట. వాటిల్లోఅక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘గీతాంజలి’ అనే చిత్రం ఒకటి. ఈ సినిమాలో ‘ఓ పాప లాలి’ అనేపాటని తెలుగు మరియు తమిళ భాషల్లో పాడాల్సి ఉందట ఆరోజు. ఆ పాట పాడే సమయం లో ఎస్పీచాలా నరకం చూశాడట.
ఒక లైన్ అందుకునేలోపే ఎదో ఒక పదం దగ్గర గొంతు రాకపోవడం, అలా పదే పదే ప్రాక్టీస్ చేసి చేసేలోపునాలుగు రోజుల సమయం పట్టిందట. పాపం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి ఇబ్బంది ని చూసి ఆమెసతీమణి చాలా బాధపడేది అట. ఈమధ్యనే ఒక ప్రముఖ హీరో తో మీకు విబేధాలు ఏర్పడ్డాయి కదా, అతను మీ మీద ఏమైనా చాటబడి చేశాడా ? అని అడిగిందట. దానికి ఎస్పీ నవ్వుకొనిఅలాంటిదేమి లేదని చెప్పాడట. ఆ తర్వాత కొన్నాళ్ళకు గొంతు సర్జరీ చేయించుకొని ఎస్పీమళ్ళీ నార్మల్ అయిపోయాడట.