తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందించారు. చిరంజీవి వారసుడిగా అడుగుపెట్టినటువంటి ఈయన తండ్రికి మించిన తనయుడుగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ఏ విషయం గురించి ఆయన చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. ఏ విషయంలో కూడా ఈయన తొందరపడరు అనే విషయం మనకు తెలిసిందే.
ఈయన ఆలోచన ధోరణి ఈయన వ్యక్తిత్వం అంత తొందరగా ఇతరులకు అర్థం కాదు. ఈయనని బాగా దగ్గరనుంచి చూసినవారు మాత్రమే ఈయన స్వభావం గురించి చెబుతూ ఉంటారు. ఇక చరణ్ ఏ విషయంలో అయినా కూడా ఇతరులను నొప్పించకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ఇకపోతే ఇలా అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేసే చరణ్ ఒక విషయంలో మాత్రం డైరెక్టర్ ను భారీగా ఇబ్బందులు పెట్టారని తెలుస్తుంది.
రామ్ చరణ్ (Ram Charan) కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గోవిందుడు అందరివాడే. ఈ సినిమాకి కమిట్ అయిన తర్వాత సినిమా షూటింగ్ చేయాలి అనుకున్న సమయంలో ఈ సినిమాలో జయసుధ పాత్రలో ముందుగా నటి రోజ నటిస్తున్నారని చెప్పార. అప్పటివరకు ఈ విషయం తెలియని రాంచరణ్ ఈ విషయం తెలిసే సరికి ఈ సినిమాలో కనుక రోజా గారు ఈ పాత్రలో నటిస్తే నేను నటించనని కృష్ణవంశీ గారికి డైరెక్ట్ గా చెప్పేసారట.
ఆమె ఉంటే నేను ఈ సినిమా షూటింగుకు రానని ఈయన దాదాపు కొద్ది రోజుల పాటు షూటింగ్ కూడా రాలేదని అయితే అప్పటికి ఇంకా రోజాపై ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు రోజా గారిని పెట్టుకుంటే రామ్ చరణ్ లాంటి హీరో ఈ సినిమాకి దొరకరు కనుక కృష్ణవంశీ కూడా ఆమెను తొలగించి జయసుధను పెట్టుకున్నారట. ఇలా రోజా ఆ సినిమాలో నటిస్తే చరణ్ ఎందుకు నటించిన చెప్పారు అనే విషయానికి వస్తే.. రోజాకు మనవడి పాత్రలో నటించడం చరణ్ కు ఇష్టం లేకపోవడంతోనే ఇలా మాట్లాడారని తెలుస్తోంది.