ఒక పాటను ఎంత మంది పాడతారు? మామూలుగా అయితే పాటను ఒకరే పాడతారు, ఇంకా లేదంటే ఇద్దరు పాడతారు. ఈ మధ్య అయితే ముగ్గురు, నలుగురు కలసి ఓ పాటను పాడుతున్నారు. అలా సినిమాలో ఆరు పాటలు ఉంటే గరిష్ఠంగా 24 మంది పాడతారు. కనిష్ఠంగా 12 మంది పాడతారు. కోరస్‌తో కలుపుకుంటే మరీ ఎక్కువగా అనుకుంటే 50 మంది అవుతారు. కానీ ఓ సినిమాకు 120 మంది పాడారు అంటే విషయమే కదా. ఇదెక్కడో హాలీవుడ్‌లో అనుకునేరు. మన టాలీవుడ్‌లోనే జరిగింది. ఆ పాటలను రికార్డు చేసింది తమన్ అయితే, వాడింది ‘అఖండ’లో. ఈ విషయాన్ని తమన్ ఇటీవల ప్రకటించారు.
దానికేముంది ఇద్దరో, ముగ్గురో పాడేసి వెనుకు కోరస్‌లాగా వంద మందికిపైగా సింగ్సర్ పెట్టేశారేమో అనుకోవచ్చు. కానీ జరిగింది అది కాదట. మొత్తంగా 120 మంది గాయనీగాయకులు ‘అఖండ’ పాటలు పాడారట. అంతే కాదు ఈ మొత్తం ప్రక్రియ నెల రోజుల పాటు సాగిందట. సినిమా పాటల నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీపడక పోవడం వల్ల ఇలా 120 మంది గాయకులు వచ్చారని తమన్ చెప్పుకొచ్చారు. ‘అఖండ’ లాంటి సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాలేదని చెప్పాడు తమన్.
అంతేకాదు ‘అఖండ’ టైటిల్ సాంగ్ కోసమే పది మందికిపైగా గాయనీగాయకులు పని చేశారట. మిగిలిన పాటల కోసం ఇద్దరేసి, ముగ్గురేసి గాయకులు కలసి పని చేశారని చెప్పారు. మొత్తంగా సినిమా పాటల రికార్డింగ్ పూర్తయ్యే సరికి సింగ్సర్ సంఖ్య 120కి చేరిందట. పరమేశ్వరుడి మీద సాగే అఖండ టైటిల్ గీతాన్ని ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్‌తో పాడించామని తమన్ చెప్పాడు. ఆ ఒక్క పాటకే నెల రోజులు తీసుకున్నామని తెలిపాడు. అఘోరాల రీసెర్చ్ చేసి ఈ పాట రికార్డ్ చేశామని తమన్ తెలిపాడు.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!