పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్, రేణు దేశాయ్ హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బద్రి’. ‘విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్’ బ్యానర్ పై టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2000 వ సంవత్సరం ఏప్రిల్ 20 న ఈ మూవీ రిలీజ్ అయ్యింది.నేటితో ఈ చిత్రం విడుదలై 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది.దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 22 ఏళ్ళు పూర్తి కావస్తోంది.
అయితే వరుస విజయాలతో మంచి ఫామ్లో ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ వల్ల ‘బద్రి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రమణ గోగుల సంగీతం లో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అవ్వడంతో అభిమానుల ఆశలకు ఆకాశాలే హద్దు అన్నట్టు నెలకొంది పరిస్థితి. అయితే ఈ సినిమా విడుదల రోజున మొదటి షోతోనే ప్లాప్ టాక్ నమోదైంది. దీంతో పూరి బాగా డిజప్పాయింట్ అయ్యారట. తన ఫస్ట్ సినిమాకే ఇలాంటి టాక్ రావడమేంటి అని ఆయన చాలా బాదపడ్డారట.
ఈ విషయాన్ని పూరికి అత్యంత సన్నిహితుడైన సింగర్ మరియు నటుడు రఘు కుంచె చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ‘బద్రి’ మూవీకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ టైములో ఫిలింనగర్లో ‘బద్రి’ సినిమాకి సంబంధించి ఓ ఆఫీస్ ఉండేది. నేను ఈవెనింగ్ అక్కడికి వెళ్ళే సరికి పూరి బాధపడుతూ కింద కుర్చున్నాడట. ‘ఎన్నో కలలు కని ఈ సినిమా తీసాను ఇలా అయిపోయిందేంటి..!’ అంటూ చెప్పి బాధపడ్డాడు.
కానీ రెండో రోజు నుండీ ఈ చిత్రం టాక్ పాజిటివ్ గా మారింది. 3వ రోజు నుండీ పికప్ అయ్యి ఏకంగా 200 రోజులు ఆడింది’ ఆ మూవీ అంటూ చెప్పుకొచ్చాడు రఘు కుంచె. పూరి తెరకెక్కించిన పలు సినిమాలకి ఇతను సంగీతం అందించడం జరిగింది. ప్రస్తుతం ఈయన సింగర్ గా పాటలు పడుతూనే విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు.