Salman Khan: ‘ఏంటమ్మా సాంగ్ వెనుక ఇంత కథ నడిచిందా?

సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసి క బాయ్ కిసి క జాన్’ అనే కొత్త సినిమా రూపొందింది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కూడా టార్గెట్ చేస్తూ రూపొందింది అని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో వెంకటేష్, పూజా హెగ్డే వంటి స్టార్లు ఉన్నారు. ఏప్రిల్ 28 న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుండి విడుదలైన పాటలు కూడా నిత్యం ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ‘బతుకమ్మ’ పాట ఈ సినిమాలో ఉండడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.

అలాగే ఇటీవల విడుదలైన ‘ఏంటమ్మా’ అనే పాట అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అని చెప్ప్పాలి.ఎందుకంటే ఈ పాటలో సల్మాన్ ఖాన్, వెంకటేష్ లతో పాటు రాంచరణ్ కూడా డాన్స్ చేశాడు. కాబట్టి రెండు మూడు రోజుల నుండి ఈ పాట తెగ వైరల్ అవుతుంది. చాలా మంది స్టేటస్ లు పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ పాట వెనుక చిన్న కథ కూడా దాగి ఉంది.

ఈ పాట చిత్రీకరణ మొత్తం ‘ఆచార్య’ సినిమా కోసం వేసిన ధర్మస్థలి సెట్ లో జరిగింది. ఆ సినిమాకి రాంచరణ్ కూడా ఓ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తో అతని స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ రోజు షూటింగ్ చూడటానికి అని వచ్చిన చరణ్ కు … సల్మాన్, వెంకీ ల తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ కలిగిందట. ఇదే విషయాన్ని సల్మాన్ కు చెప్పాడు చరణ్. అందుకు సల్మాన్ ఒప్పుకోలేదట.

అయినా చరణ్ పట్టుబట్టడంతో నెక్స్ట్ రోజు రమ్మన్నాడట. అంతే ఆ నెక్స్ట్ రోజు చరణ్ మేకప్ వేసుకుని వచ్చేసినట్టు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాటకి రాంచరణ్ వేసిన స్టెప్పులు అదిరిపోయాయనే చెప్పాలి. అలాగే పూజా హెగ్డే మరోసారి తన థైస్ అందాలు కూడా ఈ పాటలో చూపించింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus