ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. ఇప్పటివరకు జక్కన్న దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.
రాజమౌళి తన తదుపరి సినిమా మహేష్ బాబుతో చేయబోతున్నారు ప్రస్తుత ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా రాజమౌళి సినిమా అంటే తప్పకుండా ఫోటోగ్రాఫర్ గా సెంథిల్ ఉండాల్సిందే. అయితే మహేష్ బాబు సినిమా కోసం మాత్రం ఫోటోగ్రాఫర్ గా సెంథిల్ ను దూరం పెట్టారని తెలుస్తుంది. ఆయన పిఎస్ వినోద్ ఫోటోగ్రాఫర్ గా పనిచేయబోతున్నారని తెలుస్తుంది. ఈయన ఎక్కువగా త్రివిక్రమ్ సినిమాలకు మాత్రమే ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తారు.
ప్రస్తుతం వినోద్ (Mahesh) మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి గుంటూరు కారం సినిమాకు పనిచేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి సినిమాలో బిజీ కానున్నారు. అయితే తన సినిమాలకు ఎంతో నమ్మకంగా ఎంతో కష్టపడుతూ కొన్ని సంవత్సరాలు పాటు రాజమౌళితో జర్నీ చేస్తున్నటువంటి సెంథిల్ ను జక్కన్న దూరం పెట్టి వినోద్ ను తీసుకోవడంతో ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక ఈ సినిమాకు ఫోటోగ్రాఫర్ గా సెంథిల్ దూరంగా ఉన్నప్పటికీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జక్కన్నకు అసిస్టెంట్ గా పని చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా తనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడం కోసం సెంథిల్ ను తీసుకున్న తరుణంలో ఫోటోగ్రఫీ అవకాశం వినోద్ కి వచ్చిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే వినోద్ కుమార్ కి సైతం ఈ సినిమా ఎంతో ప్రయోజనకరంగా మారబోతుందని తెలుస్తోంది.