మహేష్ బాబు (Mahesh Babu) కెరీర్లో ‘ఖలేజా'(Khaleja) ఒక స్పెషల్ మూవీ. కానీ అది ఆ టైంలో అంతగా ఆడలేదు. షూటింగ్ చాలా డిలే అయ్యింది. టైటిల్ గురించి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా టైటిల్ విషయంలో చిత్ర బృందం కోర్టు వరకు వెళ్ళింది అనే విషయం ఇప్పటి జనరేషన్ కి తెలిసుండకపోవచ్చు. అప్పట్లో ‘ఖలేజా’ టైటిల్ ను ముందుగా వేరే సినిమా యూనిట్ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంది. అయితే మహేష్ బాబు – త్రివిక్రమ్ (Trivikram) తమ సినిమాకి ఈ టైటిల్ పెట్టుకుని ప్రమోషన్స్ చేసుకోవడం మొదలుపెట్టారు.
అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆ చిన్న సినిమా మేకర్స్ ఒక్కసారిగా కేసు వేసి.. ‘ఇది మా టైటిల్’ అని కోర్టుకెక్కారు. ఆధారాలు కూడా వారికే అనుకూలంగా ఉన్నాయి. తీర్పు వారికే అనుకూలంగా వచ్చేది. అయితే త్రివిక్రమ్- మహేష్ సినిమా లాయర్.. అప్పటికే ‘సినిమా ప్రమోషన్స్ నిర్వహించి రిలీజ్ కి దగ్గర పడుతున్న టైంలో ఇలా ఎంతవరకు కరెక్ట్? ముందుగా చెబితే వేరే తమ క్లైంట్స్ వేరే ఆప్షన్ చూసుకునే వాళ్ళు కదా! అంటూ డిఫెండ్ చేశారు.
దీంతో జడ్జి ఇది కూడా న్యాయమే. కాబట్టి సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది అని సూచించారు. అందుకు నష్టపరిహారంగా రూ.10 లక్షల వరకు తమ క్లైంట్స్ తో మాట్లాడి ఇప్పిస్తాను అని త్రివిక్రమ్- మహేష్ తరఫు న్యాయవాది చెప్పారు. అందుకు ఓకే చెప్పారు కేసు వేసిన చిన్న సినిమా మేకర్స్. ఈ క్రమంలో కోర్టుకి లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత ఫైనల్ జడ్జిమెంట్ అనగా.. ఆ చిన్న సినిమా యూనిట్ ‘మేము రూ.25 లక్షలకి అయితే కేసు వెనక్కి తీసుకుంటాము’ అంటూ మాట మార్చారట.
దీంతో జడ్జి ‘ఇంతకు ముందు రూ.10 లక్షలు సరే అని ఇప్పుడు మాట మార్చడం ఏంటి?’ అంటూ అప్పటి వరకు సైలెంట్ గా ఉండి రిలీజ్ టైంలో కేసు వేయడం… తర్వాత రూ.10 లక్షలకి ఓకే చెప్పి వెంటనే రూ.25 లక్షలు కావాలి అనడం.. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నవి అని భావించి.. రిలీజ్ డేట్ పై ఉన్న అబ్జెక్షన్ ను తీసివేశారు. దీంతో ‘మహేష్ ఖలేజా’ పేరు మార్చుకుని సినిమాని రిలీజ్ చేసుకున్నారు. అయినప్పటికీ ఫలితం చేదుగానే వచ్చింది.