Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో ఎలిమినేషన్ ఆర్డర్ ఏంటి ? ట్విస్ట్ ఇస్తాడా ?

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సర్వం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. చాలామంది పార్టిసిపెంట్స్ కి మిస్డ్ కాల్ వెళ్లడం లేదని ఎంతోమంది కంప్లైట్స్ ఇస్తునే ఉన్నారు. అందుకే., ఒక్కరోజూ ఒక్కసారే మిస్డ్ కాల్ ఇచ్చే అవకాశం మాత్రమే ఉందని క్లియర్ గా పోస్టర్ రిలీజ్ చేశారు స్టార్ మా టీమ్. ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ పోస్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ కి గట్టిగా తాకింది. నిజానికి ఓటింగ్ అనేది ఎప్పుడూ కూడా అఫీషియల్ గా లీక్ అవ్వదు.

కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఇదిగో అఫీషియల్ ఓటింగ్ అంటూ చాలా పోస్టర్స్ కనిపిస్తున్నాయి. ఓటింగ్ ఆర్డర్ ఇదే అంటూ చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంతేకాదు, ఇల్టా పుల్టా కాబట్టి మొన్న ఫైనలిస్ట్ లని ఎలాగైతే చూపించారో అదే ఆర్డర్ లో విన్నర్ కూడా డిసైడ్ అవుతారని చెప్తున్నారు. ఆ ఆర్డర్ ప్రకారం చూస్తే అర్జున్ – ప్రియాంక – యావర్ – అమర్ దీప్ – పల్లవి ప్రశాంత్ – శివాజీ ఇలా ఉన్నారు. ఈ లెక్కన స్టేజ్ పైకి పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ ఇద్దరూ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

అప్పుడు 50 లక్షలు ప్రైజ్ మనీ శివాజీ ఏం చేస్తాడు అనేది కూడా ఆసక్తిగా మారింది. అయితే, ఇప్పుడు నిజంగా అఫీిషియల్ ఓటింగ్ అనేది లీక్ అయ్యిందా లేదా అనేది ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఒక్కసారి అన్ అఫిషియల్ పోలింగ్ లో చూసినట్లయితే., పల్లవి ప్రశాంత్ ఎప్పటిలాగానే టాప్ లో ఉన్నాడు. ఇలాగే ఇంకొక్కరోజు అయితే అతడే విన్నర్ అవుతాడు. 33 పర్సెంట్ వరకూ ఓటింగ్ వస్తోందంటే ఇక తిరుగులేదనే చెప్పాలి. ఎందుకంటే, శివాజీ 25 పర్సెంట్ మాత్రమే ఉంది. అంటే 8 పర్సెంట్ వరకూ (Bigg Boss 7 Telugu) ఓటింగ్ ని లాగాలి.

ఇప్పుడు వేస్తున్న ఓట్లు లక్షల్లో ఉంటాయ్ కాబట్టి అంత పర్సెంట్ లాగడం అనేది కొద్దిగా కష్టమే. అయితే, అమర్ దీప్ 23 పర్సెంట్ వరకూ వచ్చాడు. కాబట్టి శివాజీని బీట్ చేయగలడని అనిపిస్తోంది. ఒకవేళ చేస్తే అమర్ దీప్ రన్నరప్ గా మిగులుతాడు. కానీ, బిగ్ బాస్ అఫీషియల్ ఓటింగ్ మాత్రం డిఫరెండ్ గా ఉండే ఛాన్స్ ఉంది. శివాజీ – పల్లవి ప్రశాంత్ ఇద్దరూ స్టేజ్ పైకి వస్తారని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

ఇక మరోవైపు ని మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకరిని చేస్తారనే టాక్ అనేదే వచ్చింది. చాలామంది అర్జున్ ఎలిమినేట్ అయ్యాడని కూడా న్యూస్ వైరల్ చేశారు. కానీ, అలాంటిది ఏమీ జరగలేదు. ప్రస్తుతానికి అన్ అఫీషియల్ పోలింగ్స్ లో మాత్రం పల్లవి ప్రశాంత్ అయితే టాప్ లోనే ఉన్నాడు. మరి అన్ని ఫ్లాట్ ఫార్మ్ మీద అయితే మ్యానుప్లేట్ చేయలేరు కాబట్టి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus