బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ నలుగురు మద్యలో చిచ్చు పెట్టింది. ఓ బేబీ టాస్క్ లో ఫస్ట్ రెండు రౌండ్స్ లో అమర్ గేమ్ లో మార్పులు తెచ్చాడు. ఫస్ట్ పల్లవి ప్రశాంత్ ని తీసేశాడు. ఆ తర్వాత యావర్ ని కావాలనే అవుట్ చేశాడు. దీంతో అమర్ కి – యావర్ కి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత లాస్ట్ లో శివాజీ గేమ్ ని పూర్తిగా మార్చేశాడు. ముగ్గురు మిగిలి ఉండగా వెళ్లి గౌతమ్ బొమ్మని పట్టుకున్నాడు.
దీంతో గౌతమ్ రేస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా అర్జున్ – శివాజీ ఇద్దరే మిగిలారు. ఈ ఇద్దరిలో హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో శివాజీని కెప్టెన్ ని చేశారు. అర్జున్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కాబట్టి శివాజీని కెప్టెన్ గా చేశారు హౌస్ మేట్స్. ఇక హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంలో కూడా చాలా ఆర్గ్యూమెంట్స్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.యావర్ , పల్లవి ప్రశాంత్, భోలే, అశ్విని, ఇలా మెజారిటీ ఇంటిసభ్యులు శివాజీకి ఓటు వేశారు.
దీంతో ఈ సీజన్ లో ఫస్ట్ టైమ్ శివాజీ కెప్టెన్ అయ్యాడు. నిజానికి శోభాశెట్టి విఐపి రూమ్ ని మొత్తాన్ని ఆక్యూపై చేస్తూ ముడు వారాలు ఇక్కడే ఉండచ్చని అనుకుంది. ఆ తర్వాత అమర్ కెప్టెన్ అవుతాడు, ప్రియాంక అవుతుంది కాబట్టి ఇక్కడే ఉండిపోతా అంటూ లెక్కలు వేసింది. కానీ ఆ లెక్కలు ఇప్పుడు తప్పాయ్. మిగతా హౌస్ మేట్స్ మాట ఎలా ఉన్నా సరే, శివాజీ కెప్టెన్ అవ్వడం మాత్రం చాలామందికి నచ్చింది.
ఇక కెప్టెన్సీలో ఎలాంటి రూల్స్ పెడతాడు అనేది చూడాలి. అలాగే, శివాజీ ఈవారం సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. సగానికి సగం పైగా ఓటింగ్ అనేది కైవసం చేసుకున్నాడు. దీంతో సేఫ్ జోన్ లోకి వచ్చాడు. ఇక మిగతా నలుగురు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు. మరి వీళ్లలో (Bigg Boss 7 Telugu) ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.