Prabhas, Rajamouli: జక్కన్న ప్లాన్ ఇదేనా.. ఆ సీక్వెల్ పై దృష్టి పెట్టారా?

ప్రభాస్ రాజమౌళి కాంబో బ్లాక్ బస్టర్ కాంబో కాగా ఈ కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి, బాహుబలి1, బాహుబలి2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఒకరు తాజాగా ప్రభాస్ రాజమౌళి కాంబో సినిమా తర్వాత ప్రభాస్ తో ఒక సినిమాను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఈ కామెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

మహేష్ సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్ (Prabhas) తోనే సినిమా తీస్తారని పరోక్షంగా కన్ఫామ్ అయింది. ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్ లో బాహుబలి3 తెరకెక్కుతుందా? లేక మరో ప్రాజెక్ట్ తెరకెక్కుతుందా? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. ప్రభాస్ జక్కన్న కాంబో సినిమా బాహుబలి సినిమాను మించి ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బాహుబలి2 సీక్వెల్ పై రాజమౌళి దృష్టి పెట్టారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

జక్కన్న మహేష్ సినిమాను పూర్తి చేసిన వెంటనే ప్రభాస్ సినిమాతో బిజీ అవుతారని కామెంట్లు వినిపిస్తుండగా ఆ కామెంట్లకు సంబంధించి కూడా స్పష్టత రావాల్సి ఉంది. రాజమౌళి విజువల్ వండర్స్ ను తెరకెక్కిస్తూ అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో జక్కన్న మరిన్ని బ్లాక్ బస్టర్లను తెరకెక్కించి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తారేమో చూడాలి. మహేష్ జక్కన్న కాంబో మూవీ షూట్ పూర్తి కావడానికి నాలుగేళ్ల సమయం పడుతుందని తెలుస్తోంది.

మహేష్ రాజమౌళి కాంబో మూవీ మరిన్ని రికార్డులను క్రియేట్ చేయడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుండగా ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ రావడం ఖాయమని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ బడ్జెట్ 600 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus