ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ మూవీ ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ అదిరిపోయే రెస్పాన్స్ ను అందుకుంది. అయితే సలార్ హిందీ వెర్షన్ మాత్రం సౌత్ భాషలతో పాటు స్ట్రీమింగ్ కాలేదు. ఆలస్యంగానైనా సలార్ హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని భావించిన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసేలా ఆసక్తికర అప్ డేట్ రావడం గమనార్హం. సలార్ హిందీ వెర్షన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుందట.
హిందీలో సలార్ ఓటీటీ పార్ట్నర్ రివీల్ కాగా ఫిబ్రవరి 16వ తేదీ నుంచి ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. సలార్ ను హిందీలో చూడాలని భావించే అభిమానులు ఆ తేదీ నుంచి ఈ సినిమాను చూడవచ్చు. సలార్ హిందీ వెర్షన్ కూడా అంచనాలకు మించి హిట్ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు సలార్2 శౌర్యాంగ పర్వం మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియాల్సి ఉంది.
సలార్2 షూట్ ఈ ఏడాదే మొదలుకానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. బాహుబలి2 ఏ స్థాయిలో విజయం సాధించిందో సలార్2 అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్2 సినిమాలో ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం అభిమానులలో సైతం ఆసక్తి నెలకొంది.
సలార్2 (Salaar) మూవీ మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సలార్2 శౌర్యాంగ పర్వం వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉండగా ఆయన స్పందిస్తే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సలార్2 మూవీ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.