ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది. స్పెషల్ స్టేటస్ ప్రకటించాలని కోరుతూ జనవరి 26 న వైజాక్ లోని ఆర్ కె బీచ్ లో మౌన ప్రదర్శనను చేపట్టనుంది. ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత మద్దతు తెలపాలని, తరలి రావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళ వారం “దేశ్ బచావో” అనే ఆల్బమ్ ని రిలీజ్ చేశారు. ఇందులో ఆరు పాటలు ఉండగా మంగళవారం నాలుగు పాటలను విడుదల చేశారు. యువ డీజే పృద్వి సాయి పవన్ సినిమాల్లోని అద్భుతమైన పాటలను రీమిక్స్ చేసి అదరగొట్టారు. ఇవి పవన్ అభిమానులతో పాటు ఆంధ్ర యువతలో చైతన్యం రగిలించాయి.
“ట్రావెలింగ్ సోల్జర్”
తమ్ముడి సినిమాలో “ట్రావెలింగ్ సోల్జర్” పాట యువతలో ఎంతో స్ఫూర్తిని నింపింది. రమణ గోగుల కంపోజ్ చేసి పాడిన ఈ పాటను “దేశ్ బచావో” ఆల్బమ్ తొలి పాటగా రిలీజ్ చేసి ప్రకంపనలు కలిగించారు. గత ఏడాది నవంబర్ లో అనంతపురంలో ప్రత్యేక హోదాపై నిర్వహించిన సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ ఆవేశపు ప్రసంగాన్ని జోడించి పాటకి పవర్ తీసుకొచ్చారు.
నారాజు గాకురా మా అన్నయ్య
పవర్ స్టార్ నటించి, దర్శకత్వం వహించిన సినిమా జానీలో “నారాజు గాకురా మా అన్నయ్య” సాంగ్ అప్పట్లో సంచనలమయింది. రమణ గోగుల స్వర పరిచి పాడిన ఈ పాట రీమిక్స్ రూపంలో మరో సారి హంగామా సృష్టిస్తోంది. స్పెషల్ స్టేటస్ పై మీడియాలో ప్రసారమైన వార్తల హెడ్ లైన్స్ ని ఇందులో మిక్స్ చేయడం కొత్త గా అనిపిస్తోంది.
ఏ మేర జహ
పవన్ హిట్ చిత్రాల్లో ఖుషి ఒకటి. అందులో మొదటి పాట “ఏ మేర జహ” ని మణిశర్మ పవన్ కి యువతలో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని కంపోజ్ చేశారు. ఆ పాటని నేటి పరిస్థితికి అనుగుణంగా పృద్వి సాయి కంపోజ్ చేశారు. ఈ పాట్లతో దేశ్ బచావో.. జై హింద్ అని పవన్ నినాదాలు రక్తాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి.
లేలే లేలే
గుడుంబా శంకర్ చిత్రం కోసం స్వర బ్రహ్మ మణిశర్మ స్వర పరిచిన “లే లే లేలే” పాటను పృద్వి సాయి సూపర్ గా రీ మిక్స్ చేశారు. మూడు నిముషాల నిడివిగల ఈ సాంగ్ ఎంతో ఉత్సాహంగా సాగింది. ఒరిజన్ వెర్షన్ కంటే దీనిని జోష్ గా తీసుకు రావడంలో పృద్వి సాయి సక్సస్ అయ్యారు. “అణిచేస్తే ముంచేయాలి లే ” అంటూ పవన్ ఈ పాట ద్వారా ఆంధ్ర యువతకు పిలుపునిచ్చారు.