Star Comedian: ఇప్పుడు ఆ కమెడియన్ రేంజ్ ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

నేటి తరం యూత్ ఆడియన్స్ కి బాగా ఇష్టమైన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో విశ్వక్ సేన్ ని ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం చేసిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఒక నలుగురి స్నేహితుల మధ్య జరిగిన ఈ కథని చూసి మన రియల్ లైఫ్ లోని సంఘటనలను కచ్చితం గా గుర్తు చేసుకుంటాం. ఈ సినిమాలో ప్రతీ ఒక్కరు ఎంతో సహజంగా నటించారు. ఈ చిత్రం ద్వారానే ప్రముఖ కమెడియన్ అభినవ్ గోమతమ్ తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు.

ఇతని కామెడీ టైమింగ్ ఈ చిత్రాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ సినిమాకి ముందే (Star Comedian) అభినవ్ గోమతం నాలుగు సినిమాల్లో నటించాడు. సుమంత్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘మళ్లీ రావా ‘ చిత్రం తో వెలుగులోకి వచ్చాడు, ఆ తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈయన డిమాండ్ ఎలా ఉంది అంటే , ప్రతీ శుక్రవారం విడుదల అయ్యే సినిమాల్లో ఇతను కచ్చితంగా ఉండాల్సిందే.

ఆ రేంజ్ కి ఎదిగిపోయాడు, ఈ ఏడాది ఇప్పటి వరకు ఈయన ‘విరూపాక్ష’, ‘స్పై’ వంటి చిత్రాల ద్వారా మన ముందుకు వచ్చాడు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి తో కలిసి నటించిన ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7 వ తారీఖున విడుదల అవ్వబోతుంది. వీటితో పాటు ఆయన డిస్నీ + హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ లో నటించి మంచి మార్కులే కొట్టేసాడు. ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది.

ఇదంతా పక్కన పెడితే అభినవ్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అబ్బాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఉద్యోగం దొరకక కొన్ని సంవత్సరాలు జీవనాధారం కోసం మల్టీప్లెక్స్ థియేటర్స్ లో పని చేసేవాడు. ఆ తర్వాత సినిమాల మీద మక్కువ తో గట్టిగా ట్రై చేసి, అవకాశాలు సంపాదించి నేడు ఈ స్థాయిలో నిలిచాడు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus