ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన 21 రోజుల పాటు దీక్షకి కట్టుబడి దానికి సంబంధించిన క్రమశిక్షణలో మెలుగుతారు. మొదట ఈ విషయం బయటకు వచ్చింది కానీ దీనికి సంబంధించిన ఫోటోలు మాత్రం బయటకి రాలేదు.ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోల కోసం పరితపించారు. అయితే ఓ సందర్భంలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని ఫోటోలు కోరగా వారి ఇష్టాన్ని కాదనలేక వారికి ఫోటో అవకాశాన్ని కల్పించారు ఎన్టీఆర్.
అలా వాళ్ళ ద్వారా ఈ ఫోటోలు బయటకి రావడం జరిగింది. ఈ ఫోటోల్లో ఆంజనేయస్వామి బొట్టు రంగులో ఉండే దుస్తులనే ఆయన ధరించారు. పాదాలకు చెప్పులు మాత్రం ధరించలేదు. 21 రోజులు ఇవే నియమాలు ఆయన పాటిస్తారు. హనుమాన్ జయంతి రోజు నాడు ఈ ఫోటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుండి సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తూనే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో కొంత మందిని ఈ ఫోటోలకు సంబంధించిన ప్రశ్నలు వెంటాడుతున్నాయి.
గతంలో ఎన్టీఆర్ ఈ విధంగా మాల వేసుకున్న సందర్భాలు ఎక్కువగా లేవు. అసలు ఎన్టీఆర్ ఈ మాల వేసుకోవడానికి గల ఎవరు? ముంబైలో ‘పెన్ మూవీస్’ వారు ఇచ్చిన ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ పార్టీ తర్వాత ఎన్టీఆర్ సడెన్ గా మాయమయ్యాడు. మరోపక్క రాంచరణ్ అయ్యప్ప మాలలో దర్శనమిచ్చాడు. దాంతో ఎన్టీఆర్ ను ప్రేరేపించింది కూడా రాంచరణ్ అని అంతా అనుకుంటున్నారు. కానీ కాదని తెలుస్తుంది.
హనుమాన్ దీక్ష ఎక్కువగా చేపట్టేది మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తితోనే ఎన్టీఆర్ ఈ విధంగా దీక్షలో పాల్గొంటున్నట్టు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘ఆచార్య’ పూర్తయిన వెంటనే కొరటాల శివ.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నారు. అటు తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుంది.