దేవర (Devara). సినిమాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపించనున్నారు. దేవర, వర పాత్రల్లో తారక్ కనిపించనుండగా గతంలో తారక్ తండ్రీకొడుకులుగా ఆంధ్రావాలా (Andhrawala), శక్తి (Sakthi) సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేదు. ఆ సినిమాలలో ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర చనిపోతుంది. అయితే దేవర సినిమాకు ఆంధ్రావాలాతో పోలిక వస్తున్న నేపథ్యంలో కొరటాల శివ (Koratala Siva) స్పష్టత ఇచ్చారు. దేవర సినిమాలో హీరో తండ్రికొడుకుల పాత్రల్లో నటించినంత మాత్రాన ఆంధ్రావాలా కథ దేవర కథ ఒకటే అంటే ఎలా అని అన్నారు.
Koratala Siva
ఆంధ్రావాలా కథకు దేవర కథకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఒక హీరో తండ్రీకొడుకులుగా నటించిన సినిమాలు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయని కొరటాల శివ వెల్లడించారు. అసలు అదేం పోలిక అని కొరటాల శివ పేర్కొన్నారు. దేవర మూవీ కంప్లీట్ ఫిక్షనల్ స్టోరీ అని ఆయన వెల్లడించారు. సోషల్ మీడియాలో మంచి కంటే చెడును ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. సోషల్ మీడియాను మంచి కోసం మాత్రమే ఉపయోగించాలని ఆయన చెప్పుకొచ్చారు.
నెగిటివ్ కామెంట్లు చేయడం వేరని ద్వేషించడం వేరని కొరటాల శివ పేర్కొన్నారు. కొరటాల శివ దేవర సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్నారు. దేవర సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
నైజాంలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయి. రిలీజ్ కు మూడు రోజుల ముందే బుకింగ్స్ మొదలు కావడం ఈ సినిమాకు ఎంతగానో ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్లలో దేవర ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.