సుధీర్ బాబు ఈసారి హిట్టు కొట్టేలా ఉన్నాడుగా..!

సుధీర్ బాబు- దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందుతున్న మూడవ చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న మూవీ ఇది. గాజులపల్లె సుధీర్‌బాబు సమర్పణలో ‘మైత్రి మూవీ మేకర్స్‌’తో కలిసి ‘బెంచ్‌మార్క్ స్టూడియోస్‌’ బ్యానర్ పై బి మహేంద్రబాబు, కిరణ్ బళ్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి నుండి ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్ కూడా అందరూ మెచ్చే విధంగా ఉంది.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కొన్ని కారణాల విడుదల ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 16న ఈ మూవీని విడుదల చేయడానికి రెడీ అయ్యింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా వదిలింది. ట్రైలర్ విషయానికి వస్తే.. వృత్తి రీత్యా డాక్టరైన కృతి శెట్టి(హీరోయిన్)…. సినిమాల్లో నటించడానికి అంగీకరించడం ఆ విషయాన్ని ఫిల్మ్ మేకర్ సుధీర్ బాబు(హీరో) తో చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమైంది.

హీరోయిన్ కు నటి కావాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆమె తల్లిదండ్రులు అందుకు పూర్తి వ్యతిరేకం కాబట్టి ఆమె నటనకు దూరంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఆమె నటిగా మారడమే కాకుండా దర్శకుడు అయిన సుధీర్ బాబుతో ప్రేమలో పడుతుంది.వీరి ప్రేమకథ చివరికి ఏమైంది అనేది ఒక పాయింట్ అయితే, మరోవైపు సినిమాలంటే ఇష్టం ఉన్నప్పటికీ, ఇండస్ట్రీపై కొంతమందికి చెడు అభిప్రాయం ఉంటుంది. అందుకే చాలా మంది తెలుగు అమ్మాయిలు సినీ పరిశ్రమ వైపు కన్నెత్తి చూడటం లేదు.

వారి తల్లిదండ్రులు ఇండస్ట్రీకి వారిని దూరంగా ఉంచాలనే ప్రయత్నిస్తున్నారు. ఈ అంశాలనే హైలెట్ చేస్తూ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతుంది. రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్,అవసరాల శ్రీనివాస్ వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మంచి కంటెంట్ ఉన్న సినిమా అనే సంకేతాలు ఇస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!


‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus