ఈ మధ్య కాలంలో శర్వానంద్ ఏ సినిమాలో నటించినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. శర్వానంద్ నటించి గతేడాది విడుదలైన శ్రీకారం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఆ సినిమా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ సాధించకపోవడం గమనార్హం. శర్వానంద్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే మాత్రమే అతని కెరీర్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. శర్వానంద్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఈ నెల 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కగా కిషోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు ఏకంగా 25 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఒక విధంగా ఈ మొత్తం రికార్డ్ అనే చెప్పాలి. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు మాత్రం 20 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. హీరోయిన్ రష్మికకు ఉన్న క్రేజ్ వల్లే ఈ సినిమా హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని బోగట్టా.
పుష్ప ది రైజ్ తో హిందీలో రష్మిక ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. అందువల్ల ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు థియేట్రికల్ హక్కుల కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడయ్యాయి. శర్వానంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఫన్ జోనర్ లో ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా తెరకెక్కింది. ఆడవాళ్లు మీకు జోహార్లు టేబుల్ ప్రాఫిట్ తో రిలీజవుతూ ఉండటంతో నిర్మాత కూడా హ్యాపీగా ఉన్నారు.
శర్వానంద్ కు మాస్ సబ్జెక్ట్ లతో పోలిస్తే క్లాస్ సబ్జెక్ట్ లు ఎక్కువగా కలిసొస్తున్నాయి. శర్వానంద్ ఒక్కో సినిమాకు 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.